iDreamPost
android-app
ios-app

AP ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై అంతర్జాతీయ విద్య! అసలు ఈ IB కాన్సెప్ట్ ఏంటి?

  • Published Jan 31, 2024 | 11:59 AMUpdated Jan 31, 2024 | 1:01 PM

విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Jan 31, 2024 | 11:59 AMUpdated Jan 31, 2024 | 1:01 PM
AP ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై అంతర్జాతీయ విద్య! అసలు ఈ IB కాన్సెప్ట్ ఏంటి?

వైఎస్‌​ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి.. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పేదలకు, మధ్యతరగతి వారికి కూడా కార్పొరేట్‌ స్థాయి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో.. ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నేటి పోటీ సమాజంలో ఇంగ్లీష్‌ మీడియం ప్రాధాన్యత గుర్తించిన జగన్‌.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకువస్తున్నారు జగన్‌.

తాజగా ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మక ఘట్టం ఆవిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే విద్యా రంగంలో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సహా అనేక సంస్కరణలు తెచ్చిన సీఎం జగన్‌.. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల్లో ధనవంతులు పిల్లలు చదువుకునే ‘ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌’ (ఐబీ) సిలబస్‌ను గవర్నమెంట​ బడుల్లో చదివే విద్యార్థులకు చేరువ చేసేందుకు రెడీ అయ్యారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లల్లో ఐబీ సిలబస్‌ అమలు కోసం ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎస్‌సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు నేడు అనగా జనవరి 31, బుధవారం సాయంత్రం ఒప్పందం చేసుకోనున్నారు. ఈ నిర్ణయం వల్ల ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. ప్రపంచ స్థాయిలో పోటీ పడి విజయం సాధించేలా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసినట్లు అవుతుంది.

2024-25 నుంచి టీచర్స్‌కు ఐబీ ట్రైనింగ్‌..

ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో.. 2024 – 25 విద్యా సంవత్సరంలో దీని బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా ఈ ట్రైనింగ్‌ ఉంటుంది. 2025 జూన్‌ నుంచి ఏపీలోకి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఐబీ సిలబస్‌ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్‌ను పెంచుతూ 2035 నాటికి 10వ తరగతి, 2037కి 12వ తరగతికి అమలు చేస్తారు. పరీక్షల అనంతరం ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తాయి. ఈ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంటుంది అంటున్నారు అధికారులు.

IB concept studies in AP

ఐబీ భోధనలోని ప్రత్యేకతలు ఇవే..

ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు పొందింది. ఐబీ విధానంలో.. బట్టీ చదువులకు స్వస్తి చెబుతూ థియరీతో పాటు ప్రాక్టికల్‌ అప్లికేషన్‌ పద్ధతిలో బోధన సాగుతుంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. ప్రస్తుత, భావితరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్, బోధన, మూల్యాంకనం ఉంటుంది. చదువుతోపాటు ప్రాక్టికల్స్, విద్యార్థుల్లో నైపుణ్యాల (స్కిల్స్‌)కు ప్రాధాన్యతనిస్తారు.

సంగీతం, నృత్యం, క్రీడలు వంటి ఇతర అంశాల్లోనూ విద్యార్థులకుట్రైనింగ్‌ ఇస్తారు. వాస్తవిక జీవిత అంశాలు ఆధారంగా బోధన సాగుతుంది. ఈ సిలబస్‌ను అభ్యసించిన విద్యార్థులు ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో మూడు రెట్లు అధికంగా ప్రవేశాలు పొందుతున్నారు. ప్రపంచస్థాయి ఉద్యోగావకాశాలను సైతం వేగంగా అందుకుంటున్నారు. అలాంటి ఐబీ సిలబస్‌ను.. రాష్ట్రంలోని ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లల్లో ప్రవేశపెడుతూ సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏపీ జనాలు.

2019 నుంచే సంస్కరణలు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  2019 నుంచి విద్యారంగంలో కీలక సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ 56 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లు విద్యా సంస్కరణల కోసం వెచ్చించింది. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా సర్కార్‌ బడులను తీర్చి దిద్దుతోంది. అంతేకాక అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక కిట్‌ తదితర విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేస్తోంది.

వీటితో పాటు.. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ప్రారంభించింది. పాఠశాలలను సీబీఎస్‌ఈ బోర్డుకు అనుసంధానించింది. నాలుగు నుంచి 12వ తరగతి వరకు ఉచిత బైజూస్‌ కంటెంట్, 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్‌ కంటెంట్‌తో ఉచిత ట్యాబ్స్‌ పంపిణీ చేసింది. ఇక ఇప్పుడ ఐబీ సిలబస్‌ను తీసుకురానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి