iDreamPost
android-app
ios-app

వీడియో: ‘మీరు వెళ్లొద్దు సార్’ అంటూ విద్యార్థుల కన్నీళ్లు..

  • Published Jul 07, 2023 | 12:04 PM Updated Updated Jul 07, 2023 | 12:04 PM
  • Published Jul 07, 2023 | 12:04 PMUpdated Jul 07, 2023 | 12:04 PM
వీడియో: ‘మీరు వెళ్లొద్దు సార్’ అంటూ విద్యార్థుల కన్నీళ్లు..

విద్యార్థుల్లోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి.. జ్ఞానం అనే జ్యోతిని వెలిగించే గొప్ప వ్యక్తి గురువు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ గురువు స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  పిల్లలకు పాఠాలు బోధించడమే కాకుండా విలువలతో ఉన్నత స్థాయిలో నిలబడేలా రూపొందించడంలో  ఉపాధ్యాయులే కీలకం.  పిల్లలు ఉన్నతమైన విలువలు, మంచి వ్యక్తిత్వంతో సమాజంలో గొప్పగా ఉండేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తుంటారు. విద్యార్థులను తమ సొంత బిడ్డాల్లా చూసుకుంటారు. వారికి ఏ కష్టం వచ్చిన అమ్మనాన్నల మాదిరిగా గురువులు కూడా అల్లాడుతారు

తమను సొంత బిడ్డాల చూసుకునే ఉపాధ్యాయులపై విద్యార్థులు సైతం ఎంతో ప్రేమను పెంచుకుంటారు.  తమను ఎంతో ప్రేమగా చూసుకునే ఉపాధ్యాయులు ఒక్క రోజు స్కూల్ కి సెలవు పెట్టిన పిల్లలు అల్లాడి పోతారు. అలాంటిది ఇక స్కూల్ నుంచి శాశ్వతంగా వెళ్తున్నాడంటే పిల్లలు ఎలా ఉంటారు.  మీరు వెళ్లొద్దు మాస్టార్ అంటూ భోరునా ఏడ్చేస్తారు. అలాంటి ఘటనే  ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గౌడనహళ్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శివన్న అనే తెలుగు ఉపాధ్యాయుడు  ఐదేళ్లుగా పని చేస్తున్నారు.

ఇటీవల జరిగిన టీచర్ల బదిలీల్లో భాగంగా ఆయన  మడకశిరలోని బాలికోన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. గురువారం  గౌడనహళ్లిలోని పాఠశాలలో ఆఖరి రోజు పని చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు శివన్నకు వీడ్కోలు సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. అలానే విద్యార్థులను ఉద్దేశించి శివన్న కూడా ప్రసగించారు. ఇక వీడ్కోలు సభ అనంతరం ఆ ఉపాధ్యాయుడు పాఠశాలను వదిలి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయనను హత్తుకుని విద్యార్థులు భోరున విలపించారు. ఐదేళ్లుగా ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ.. తమన సొంత బిడ్డల చూసుకుని, ఏ  కష్టం వచ్చిన తండ్రిలా ఆదుకున్న ఉపాధ్యాయుడిని తలుచుకుని ఏడ్చేశారు. వారిని క్రమశిక్షణ మార్గంలో నడిపించిన ఉపాధ్యాయుడు తిరిగి.. తమ పాఠశాలకు రారని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

‘మీరు వెళ్లోద్దు సార్’ అంటూ విద్యార్థినీలు బతిమాలారు. విద్యార్థినిలు కన్నీటిని చూసి ఆ  శివన్న కూడా భావోద్వేగానికి గురయ్యారు. తన కంట వెంట వస్తున్న కన్నీటి ఆపుకుని.. విద్యార్థినిలను ఓదార్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలకరించటం వల్లే ఈ అభిమానం పెంచుకున్నాని ఆయన తెలిపారు. ఈ సీన్ చూసిన అందరూ ధనుష్ హీరోగా నటించిన సార్ మూవీని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం  ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎమోషనల్ సీన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş