ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలంటారు. లేదంటే ఫలితం ఉండదని చెబుతుంటారు. అది అక్షర సత్యమని బీఎస్పీ అధినేత మాయావతి రాజకీయంగా వ్యవహరిస్తున్న తీరుతో నిరూపితమవుతోంది. రాజకీయ పార్టీ ఏదైనా దాని అంతిమలక్ష్యం అధికారమే. ఎన్నికలు, ఓట్లు చుట్టూనే రాజకీయాలు సాగుతుంటాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ప్రజల మన్ననలు పొందుతాయి. అంతిమంగా ఆయా పార్టీలకు ప్రజలు ఓట్ల రూపంలో మార్కులు వేస్తారు. అయితే ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ.. ప్రజా సమస్యలు, […]
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది బీఎస్పీ అధినేత మాయావతి పరిస్థితి. తనను రాష్ట్రపతిని చేస్తున్నారంటూ ప్రచారం చేసి బీజేపీ గెలిచిందని ఆమె తాజాగా ఆరోపిస్తున్నారు. ఆదివారం లక్నోలో పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. తనను రాష్ట్రపతిని చేస్తున్నారని తన ప్రజల్ని నమ్మంచి బీజేపీ ఓట్లు దండుకుందని మాయావతి వాపోయారు. మా సోదరి రాష్ట్రపతి అవుతుందని ప్రజలు బీజేపీని గెలిపించారంటూ మాట్లాడిన మాయావతికి ఎన్నికలు అయిపోయిన నెల రోజులకు […]
బహుజనులకు రాజ్యాధికారం అనే నినాదంతో ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీఎస్పీ ఘోర పరాజయం ఎదురుకావడం ప్రవీణ్‌కుమార్‌ను ఆలోచనలో పడేసింది. అయితే ఉత్తరప్రదేశ్ ఫలితాలు, అక్కడ పార్టీ పరిస్థితితో సంబంధం లేకుండా ప్రవీణ్‌కుమార్ తన పని తాను చేసుకుపోతున్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలు చేపడుతున్నారు. పల్లెలో పర్యటనలు చేస్తున్నారు. బహుజన రాజ్యాధికారం వస్తేనే పేదలకు మంచి జరుగుతుందని చెబుతున్నారు. కేసీఆర్ గడీల […]
ఎన్నికల సమయంలోనూ, ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత బీఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయావతి వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. అన్ని పార్టీలు ప్రజా తీర్పును గౌరవిస్తూ.. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని, ప్రజల తరఫున మరింతగా పోరాడతామని ప్రకటనలు చేస్తుంటే.. మాయావతి మాత్రం తమ ఓటమికి మీడియానే కారణమంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మీడియా దుష్ప్రచారం చేయడం వల్లే ముస్లింలు బీఎస్పీకి దూరమయ్యారని, లేకుంటే బీజేపీని అడ్డుకునేవాళ్లమంటూ ఎన్నికలు అయిపోయాక నిమ్మలంగా చెబుతున్నారు. ఆడలేక మద్దెలఓడు.. మాయావతి […]
రాజస్థాన్ రాజకీయం రంజుగా మారింది. న్యాయస్థానాలను కాదని, రాజకీయంగానే తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ అసెంబ్లీని సమావేశ పరచాలని మరోసారి మంత్రివర్గ తీర్మానంతో పంపిన లేఖను గవర్నర్ మళ్లీ తప్పి పంపడంతో రాజకీయ వేడి రగులుతోంది. నిన్న మొన్నటి వరకూ సీఎం అశోక్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ మధ్యన జరిగిన ఈ రాజకీయ క్రీడలోకి బీజేపీ ఎంటర్ అవగా.. తాజాగా బీఎస్పీ కూడా చేరింది. రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, కరోనా […]