తిరుపతి ఒక అందమైన ఆధ్యాత్మిక నగరం. 1988, మే 15 ఎర్రటి ఎండల్లో ఆంధ్రజ్యోతి ట్రైనీ సబ్ ఎడిటర్‌గా తిరుపతిలో కాలు పెట్టాను. వేడికి భయపడి ఎన్నాళ్లుంటానో అనుకున్నాను. పాతికేళ్లు ఉన్నా. వాతావరణం వేడి కానీ మనుషులు చల్లనివాళ్లు. ఆదరణ, అభిమానం తిరుపతి ప్రత్యేకత. మిగతా వూళ్లకి పండగలొస్తేనే కళ. తిరుపతిలో ప్రతిరోజూ పండగ కళే. కారణం తిరుమల స్వామి. ఏడాది పొడుగునా ఏవో ఉత్సవాలు. మనం రోడ్డుపై వెళుతుంటే నెలలో సగం రోజులు మద గజాలు […]
కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి యాగం చేయిస్తున్నాడు. పద్మావతీపురంలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు మొదలైన ఈ యాగం నాలుగు గంటలుగా నిరాఘాటంగా సాగుతోంది. సుమారు మరో గంటపాటు యాగం జరుగుతుందని వేదపండితులు చెప్పారు. 110 మంది వేదపండితుల ఆధ్వర్యంలో లోకాపద నివారణార్ధం ’శ్రీనివాస అద్భుత శాంతి యాగం’ జరుగుతోంది. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ అనేక వన మూలికలను సేకరించి చేస్తున్నట్లు చెప్పారు. వనమూలికలను […]
ఆపత్కాలంలో ప్రజాప్రతినిధులు తమలోని సామాజిక సేవా గుణాన్ని బయట పెడుతున్నారు. తమకు తోచిన సామాజిక సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికుడిగా మారారు. తెల్ల చొక్కా వదిలి ఖాకీ చొక్కా తొడిగి రోడ్లమీదకు వచ్చారు. రోడ్లను, పబ్లిక్ ప్లేస్ లో శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు పరిశుభ్రత ఎంతో అవసరం అని చెబుతున్న నిపుణుల మాటలను భూమన […]
చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి కుమారులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకొని తమ రాజకీయ పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, భూమన అభినయ్‌రెడ్డి ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో తమ తండ్రుల తరఫున ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసి, వారి గెలుపునకు కృషి చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గాల్లో చురుగ్గా పర్యటిస్తూ ప్రజలందరికీ దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో […]
రాయలసీమ సమస్యలే కాదు, కళలు, సాహిత్యం గురించి కూడా అధికారికంగా, అనర్ఘళంగా మాట్లాడే వ్యక్తి భూమన కరుణాకర్‌రెడ్డి. స్వతహాగా మంచి చదువరి అయిన ఆయన ఒక విషయంపై మాట్లాడితే కూలంకుషంగా మాట్లాడుతారు. పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే నోరు విప్పుతారు. సోమవారం జరిగిన సభలో సీమపై పని గట్టుకుని జరిగిన సాంస్కృతిక దాడిని ఆయన ఖండించారు. వేల కీర్తనలు రాసిన అన్నమయ్య, కాలజ్ఞానాన్ని చెప్పిన బ్రహ్మంగారు, సామాజిక దురన్యాయాలను లేత తెలుగు పదాలతో చీల్చి చెండాడిన వేమన […]