Krishna Kowshik
తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగులకు డబుల్ ధమాకా న్యూస్. ఎన్నడు లేని విధంగా పాలక మండలిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గతంలో ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా..
తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగులకు డబుల్ ధమాకా న్యూస్. ఎన్నడు లేని విధంగా పాలక మండలిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. గతంలో ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా..
Krishna Kowshik
ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్.. ప్రతి ఒక్కరి కలలను సాకారం చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రజలకు అవసరమైన ప్రయోజనాలను సమకూరుస్తూ తమది ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంటోంది. అలాగే ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చేందుకు సానుకూలత వ్యక్తం చేస్తోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు చిరకాల స్వప్నమైన ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం లభించింది. సెప్టెంబర్‌లో తిరుమలలో నిర్వహించిన సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరైన సీఎం.. ఇంటి స్థలాలు మంజూరు చేశారు. అలాగే మాజీ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు కేటాయిస్తామని హమీనిచ్చింది. ఇప్పుడు టీటీడీ ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తూ టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది పాలక మండలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగ్గా.. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ జీవో నంబర్ 114 మేరకు అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రకటించారు భూమన. అలాగే అలిపిరి గోశాల వద్ద ఈ నెల 23 నుండి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోం నిర్వహించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఇంటి స్థలం కేటాయిస్తామని చెప్పారు భూమన.
టీటీడీ శాశ్వత ఉద్యోగులకు బ్రహోత్సవ బహుమానంగా రూ. 14వేలు అందించాలని, ఒప్పంద ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం కింద రూ. 6,850 ఇవ్వాలని కూడా నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించిన వడమాల పేట వద్ద రోడ్డు నిర్మాణానికి రూ. 25.67 కోట్లు కేటాయిస్తామని భూమన తెలిపారు. మంగళం నుండి రేణి గుంట వరకు రహదారి అభి వృద్ధి పనులకు రూ. 15 కోట్లు, తిరుపతిలోని రామ్ నగర్ క్వార్టర్స్ అభివృద్ధి పనులకు రూ. 6.15 కోట్లు, ప్రసాదాలు, ముడి సరుకులు నిల్వకు రూ. 11 కోట్లతో అలిపిరి వద్ద గోడాన్ల నిర్మాణానికి అంగీకారం తెలిపింది పాలక మండలి. ఎంఆర్ పల్లి జంక్షన్ నుండి అన్నమయ్య వరకు రోడ్డు అభివృద్ధి పనులకు రూ. 4.5 కోట్లు కేటాయింపు, పుదిపట్ల జంక్షన్ నుండి వకులమాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 21 కోట్ల పనులకు అంగీకారం తెలిపింది.
స్విమ్స్‌లో రూ.197 కోట్లతో నూతన ఆధునాతమైన భవనాలు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టీటీడీ ఛైర్మన్ భూమన. సిమ్స్‌లో కార్డియో, న్యూరో బ్లాకుల ఏర్పాటుకు రూ. 74 కోట్ల కేటాయింపు, ఆయుర్వేద ఆసుపత్రిలో రూ.1.65 కోట్లతో నూతన భవనం నిర్మాణం..రుయాలో టిబి రోగుల కోసం రూ.1.79 కోట్లతో నూతన వార్డు నిర్మాణానికి ఆమోదం, అలాగే నడకదారిలో రూ. 3.5 కోట్ల వ్యయంతో ట్రాప్ కెమెరాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్, కరీంనగర్‌లో పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి రూ.15.54 కోట్లు కేటాయించారు. ప్రాచీన కళలు ప్రోత్సహించడానికి కలంకారి, శిల్పకళల కోసం సాయంకాలం కోర్సులు ప్రారంభిస్తామని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.