ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 793 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 13,891 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కాగా 6232 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 7479 గా నమోదయింది. కరోనా కారణంగా […]
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మార్గం సుగమం అవుతోంది. ప్రభుత్వానికి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏర్పడిన అడ్డంకులు తొలగిపో్యే అవకాశం ఏర్పడుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన కేసులను ఉపసంహరించుకునే దిశలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలు ఇచ్చేశారు. అదే సమయంలో ఒడిశాతో కూడా మాట్లాడేందుకు సన్నద్దమవుతున్న తరుణంలో ప్రాజెక్ట్ కి సంబంధించిన అనుమతుల విషయంలో అన్ని అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఏర్పడుతోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇప్పటికే దశాబ్దంన్నర కాలంగా […]
ఈ ప్రకృతిలో ఎక్కడో ఉన్న వారికి మరెక్కడో జరిగిన సంఘటనతో సంబంధం ఉంటుందని ఏదో సినిమాలో విన్నట్లు గుర్తు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన ఓ ప్రకటనతో ఆ సినిమా డైలాగ్ ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఎవరు ఏమనుకున్నా, ఔనన్నా, కాదన్నా.. కొన్ని విజయాలను, చారిత్రక సంఘటనలను తన ఖాతాలో వేసుకుంటారు చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో ఆయనకు సాటి మరొకరు లేదు. తాను చేసిన పనులను తానే చెప్పుకోవడానికి సాధారణ ఎమ్మెల్యే […]
మండలిలో ఉన్న ఆధిపత్యాన్ని ఉపయోగించి ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కొంతకాలంగా టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పడబోతోంది. త్వరలోనే ఆపార్టీ ఆశలకు గండిపడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా అవును..అడ్డుకుని తీరుతాం అన్నట్టుగా వ్యవహరించిన విపక్ష టీడీపీ నేతలకు చెక్ పడడం ఖాయంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ పార్టీకి మండలిలో 22 మంది సభ్యుల మద్ధతు ఉంది. అదే సమయంలో పాలక వైఎస్సార్సీపీ బలం క్రమంగా పెరగబోతోంది. ఇప్పటికే అధికారికంగా వైఎస్సార్సీపీకి 10 […]
సంచలనం సృష్టించిన ఇఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి, టిడిపి సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు పూర్తిగా ఇరుక్కున్నట్లేనా ? ఏసిబి కస్టడీలో ఉన్న అచ్చెన్నతో పాటు అప్పటి ఉన్నతాధికారులను ఏసిబి విచారిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏసిబి విచారణలో అచ్చెన్న పెద్దగా సహకరించకపోయినా ఉన్నతాధికారులుగా పనిచేసిన వాళ్ళు మాత్రం కుంభకోణానికి సంబంధించిన పూర్తి విషయాలను బయటపెట్టేశారని తెలుస్తోంది. అంటే అరెస్టయిన ఉన్నతాధికారుల సాక్ష్యాలను బట్టి రూ. 157 కోట్ల భారీ కుంభకోణంలో అచ్చెన్నే కీలక సూత్రదారిగా అర్ధమవుతోంది. ఇఎస్ఐ […]
ఒక్కరోజులో 19,459 పాజిటివ్ కేసులు – 380 మరణాలు కరోనా వైరస్ దేశంలో ఉగ్రరూపం దాలుస్తుంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 17 వేలకు పైగా కేసులు, 350 పైగా మరణాలు సంభవించడం నిత్యకృత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 19,459 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,48,318 కి చేరింది. అంతేకాకుండా […]
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సోషల్ మీడియా సెగ తగలడం మాత్రం ఆగలేదు. సహజంగానే నారా లోకేష్‌కు నాలుక తరచూ మడతపడుతుంటుందని ఆయన మాట్లాడిన మాటలను బట్టీ తెలుస్తోంది. ఒకసారి లేదా రెండు సార్లు అంటే ఏదో ఫ్లోలో వచ్చిందని అనుకోవచ్చు. కానీ తరచూ ఆయన పదాలను తప్పుగా పలకడంతోపాటు ఒకటి అనబోయి మరొకటి అంటూ దొరికిపోతున్నారు. ఇంకేముందు సోషల్ మీడియాలో […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంటోంది. కరోనా నియంత్రణలో భాగంగా ఇప్పటికే కీలక నిర్ణయాలతో స్థానికులకు ఉపశమనం కలిగిస్తోంది. ఉదాహరణకు దేశమంతా కొన్ని రైళ్ల రాకపోకలకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మాత్రం ఎక్కువ స్టేషన్లలో ప్రవేశాలకు ససేమీరా అని చెప్పింది. కేంద్ర రైల్వో బోర్డ్ తో మాట్లాడి కేవలం ప్రధాన నగరాల్లో మాత్రమే రైళ్లు ఎక్కేందుకు, దిగేందుకు అనుమతినిచ్చింది. దాని కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారిని పూర్తిగా పరీక్షించేందుకు, అవసరమైన వారిని […]
టిడిపి నేత, మాజీ విప్ కూన రవికుమార్ తన మార్చుకోవడం లేదు. ఇప్పటికే మూడు పర్యాయాలు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కేసులో అరెస్టు అయ్యి… బెయిళ్లు తెచ్చుకొని బయట తిరుగుతున్న రవికుమార్.. ఒక అనధికార నియంతలా వ్యవహరిస్తున్నారు. నోటిని అడ్డు అదుపులో పెట్టుకోకుండా ఫోనుల్లోనే బెదిరింపులకు దిగుతున్నారు. బెదిరింపుల పరంపర కొనసాగుతునే ఉంది. ఇక తన మాట వినని వారు ఎదురుగా కనబడితే ఇంకెంత దురుసుగా వ్యవహరిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తనను ఎవరేం చేయలేరు… మహా […]
కేంద్రం రాష్ట్రానికి ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.2.70కే సరఫరా చేస్తుంటే, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రూ.9 చొప్పున సరఫరా చేస్తోందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నిర్మలమ్మా లెక్క తప్పిందని, ఆమె వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ సిఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. కేంద్ర మంత్రి చెప్పిన మాటలు అవాస్తవమన్నారు. ఎన్టీపిసి కుడ్గి నుంచి యూనిట్‌కు రూ.9.84 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నా.. కేంద్రం అంటగడుతోందని […]