iDreamPost
android-app
ios-app

MLA ఆదిమూలంకు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక

  • Published Sep 06, 2024 | 6:25 PM Updated Updated Sep 06, 2024 | 6:28 PM

MLA Adimulam: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్ఎల్ఏ ఆదిమూలం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

MLA Adimulam: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్ఎల్ఏ ఆదిమూలం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

  • Published Sep 06, 2024 | 6:25 PMUpdated Sep 06, 2024 | 6:28 PM
MLA ఆదిమూలంకు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక

ఇటీవలికాలంలో గుండె పోటు అందరినీ కలవరపెడుతున్నది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్నవారు హఠాత్తుగా గుండెపోటుకు గురవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు భారిన పడుతున్నారు. పౌష్టికాహారం తీసుకుంటూ.. నిత్యం వ్యాయామం చేస్తూ ఎంతో ఫిట్ గా ఉండే సెలబ్రిటీలను సైతం గుండెపోటు వేధిస్తోంది. ఇప్పటికే గుండెపోటుతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్ఎల్ఏ ఆదిమూలం గుండెపోటుకు గురయ్యారు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆదిమూలంకు చికిత్స అందిస్తున్నారు. గుండెపోటు తో ఆయన ఆస్పత్రిలో చేరారని, ఆయనకు స్టంట్లు కూడా వేశారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆదిమూలం గుండెపోటుకు గురైన విషయం తెలియగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు ఆదిమూలం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా ఆదిమూలం ప్రస్తుతం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş