iDreamPost
android-app
ios-app

వెంకీ మామ పార్ట్ 3 కి ఎస్ చెప్పేది ఎప్పుడో !

  • Published Dec 19, 2025 | 4:47 PM Updated Updated Dec 19, 2025 | 4:47 PM

వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా ప్రేక్షకులను ఎంత మెప్పించిందో తెలియనిది కాదు. తెలుగుతో పాటు తమిళం , కన్నడ , హిందీ , చైనీస్ ఇలా అన్ని భాషల్లోనూ ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇక ఆ తర్వాత దానికి సిక్వెల్ గా వచ్చిన దృశ్యం పార్ట్ 2 కూడా అంతే హిట్ అయింది.

  • Published Dec 19, 2025 | 4:47 PMUpdated Dec 19, 2025 | 4:47 PM
వెంకీ మామ పార్ట్ 3 కి ఎస్ చెప్పేది ఎప్పుడో !

వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా ప్రేక్షకులను ఎంత మెప్పించిందో తెలియనిది కాదు. తెలుగుతో పాటు తమిళం , కన్నడ , హిందీ , చైనీస్ ఇలా అన్ని భాషల్లోనూ ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇక ఆ తర్వాత దానికి సిక్వెల్ గా వచ్చిన దృశ్యం పార్ట్ 2 కూడా అంతే హిట్ అయింది. తెలుగులో వెంకటేష్ , హిందీలో అజయ్ దేవగన్ , కన్నడలో వి. రవిచంద్రన్ ఆయా సిక్వెల్స్ లో హీరోస్ గా నటించారు.

ఇక ఆ తర్వాత దృశ్యం పార్ట్ 3 ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మలయాళంలో ఈ థర్డ్ పార్ట్ ను హ‌న్ లాల్, డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది స్టార్టింగ్ లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక మలయాళంతో సంబంధం లేకుండా హిందీలో కూడా అజయ్ దేవగన్ దృశ్యం 3 ని స్టార్ట్ చేసేసాడు. అయితే అజయ్ దేవగన్ కొత్త కథతో ఈ థర్డ్ పార్ట్ ను స్టార్ట్ చేసాడట .

ఇవన్నీ ఇలా ఉంటె తెలుగులో మాత్రం ఎలాంటి హడావిడి లేదు. రెండు పార్ట్స్ లో అద్భుతంగా నటించిన వెంకటేష్.. మూడో పార్ట్ విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉన్నడా అని అంతా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ మన శంకర వర ప్రసాద్ గారు లో గెస్ట్ రోల్ లో నటించారు. ఇక ఆ తర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో వెంకీ మామ న‌టిస్తున్న మూవీ `ఆద‌ర్శ‌కుటుంబం హౌస్‌ నంబ‌ర్ 47′. ఈ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుందట. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక దృశ్యం 3 గురించి ఆలోచించే అవకాశం ఉండొచ్చు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.