iDreamPost
android-app
ios-app

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్! ఇక ఆరోజు నో టెన్షన్!

‘ఆకలుండదు, దాహముండదు..నిదుర పట్టదు’ ఇది మద్యం ప్రియుల రోజు వారీ పరిస్థితి. చుక్క మందు పడనిదే రోజు గడవడం కష్టం. అయితే అలాంటి వారికో గుడ్ న్యూస్. ఆ రోజు కూడా ఫుల్ పండగో

‘ఆకలుండదు, దాహముండదు..నిదుర పట్టదు’ ఇది మద్యం ప్రియుల రోజు వారీ పరిస్థితి. చుక్క మందు పడనిదే రోజు గడవడం కష్టం. అయితే అలాంటి వారికో గుడ్ న్యూస్. ఆ రోజు కూడా ఫుల్ పండగో

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్! ఇక ఆరోజు నో టెన్షన్!

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా తాగకుండా ఉండలేరు మద్యం బాబులు. మందు కొట్టడం వారికి ఓ ఎమోషన్. సాయంత్రం అవ్వగానే బార్ అండ్ లిక్కర్ షాపుల వైపు మనసు లాగేస్తూ ఉంటుంది. డబ్బులు లేకపోయినా చుక్క మందు అయినా కడుపులోకి పడనిదే ఆకలి ఉండదు, దాహం వేయదు, నిద్ర పట్టదు లిక్కర్ బాబులకు. ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి లేదంటే అప్పు చేసైనా సరే తమ టానిక్ తాగాల్సిందే. భార్య, బిడ్డలు తిండి లేక అలమటిస్తున్నా సరే.. వీరికి మాత్రం తీర్థం పడాల్సిందే. పొద్దున్న నుండి సాయంత్రం వరకు తాగుతూ ఉండే వాళ్లు కొంత మంది అయితే.. వీకెండ్స్‌లో ఎంజాయ్ చేసేవారు మరికొంత మంది. అయితే ఈ మధ్య ఏపీలో మద్యం షాపులు బంద్ చేసేందుకు పిలుపునిచ్చారు ఉద్యోగులు. దీంతో దిగులు చెందారు లిక్కర్ లవర్స్.

అలాంటి వారి కోసమే ఈ గుడ్ న్యూస్. మద్యం షాపుల్లో పనిచేసే ఉద్యోగులకు భద్రత కల్పించాలన్న డిమాండుతో మద్యం షాపులకు బంద్ పిలుపునిచ్చింది ఉద్యోగుల సంఘం. ఈ నెల 7 న మద్యం షాపుల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బేవరేజ్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న ఎక్సైజ్ పాలసీ విధానం వల్ల సూపర్ వైజర్స్, సేల్స్ మెన్ల ఉద్యోగుల భద్రతకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ బంద్ పిలుపునిచ్చింది. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ పరం చేస్తున్నారనే ప్రచారం పై కూటమి ప్రభుత్వం స్పష్తత ఇవ్వాలని లేకుంటే సెప్టెంబర్ 4 వ తేదీ నుండి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చిరించింది.

అవసరమైతే నిరసన తీవ్రతరం చేసి 7న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు బంద్ చేస్తామని ఉద్యోగుల సంఘం తెలిపింది. అయితే వర్షం, వరదలు కారణంగా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపింది. వరదలు, వానలతో ఏపీ మొత్తం అతలాకుతలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.  అదే రోజు వినాయక చవితి కూడా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బేవరేజ్ ఉద్యోగుల వార్నింగ్.. మరో వైపు బంద్‌కు పిలుపునివ్వడంతో మందు బాబుల్లో కాస్తంత ఆందోళన నెలకొంది. సెప్టెంబర్ 4 నుండే నిరసనలు, 7వ తారీఖు బంద్ కావడంతో మందు దొరకదేమో అని ఆందోళన చెందిన మద్యం ప్రియులకు.. ఈ శుభవార్త పెద్ద ఊరటనిచ్చినట్లు అయ్యింది. ఇంకేముంది ఆ రోజు కూడా యథావిథిగా, ఠంచనుగా లిక్కర్ అండ్ బారు షాపులు ముందు వాలిపోవడమే ఆలస్యం.. ఏమంటారు..?