iDreamPost
android-app
ios-app

Vijayawada Floods: వరదలో మీ కార్లు మునిగిపోయాయా? ఇన్సూరెన్స్ ఎంతొస్తుందో తెలుసా?

Car insurance Calim, Vijayawada Floods: ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక వరదల కారణంగా పలు వాహనాలు నీట మునిగాయి. ముఖ్యంగా వదరలో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ ఎంతొస్తుంది.

Car insurance Calim, Vijayawada Floods: ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక వరదల కారణంగా పలు వాహనాలు నీట మునిగాయి. ముఖ్యంగా వదరలో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ ఎంతొస్తుంది.

Vijayawada Floods: వరదలో మీ కార్లు మునిగిపోయాయా? ఇన్సూరెన్స్ ఎంతొస్తుందో తెలుసా?

గతంలో ఎప్పుడూ సంభవించని వరదలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి. భారీగా కురిసిన వానలతో ఖమ్మం, విజయవాడ నగరాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వర్షాలు వరదల కారణంగా కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. అపార్ట్ మెంట్ సెల్లార్లలో ఉన్న కార్లు నీట మునిగాయి. వరదల కారణంగా తమ వాహనాలు పాడవడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. వరదల్లో కొట్టుకుపోయిన లేదా దెబ్బతిన్న కార్లకు ఇన్సూరెన్స్ వస్తుందా? లేదా అనే అయోమయంలో పడిపోయారు. మరి ఇంతకీ వరదల్లో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ పొందడం ఎలా? ఎలా లెక్కిస్తారు? బీమా సొమ్ము ఎంత వస్తుంది? ఆ వివరాలు మీకోసం..

వరదల్లో దెబ్బతిన్నకార్లకు ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే కొత్తగా తీసుకున్న కార్లకు చేసిన ఇన్సూరెన్స్ ఆధారంగా రిపేర్, విడిభాగాల స్థానంలో కొత్తవి మార్చడం చేస్తారు. కాబట్టి ముందుగా కారు ఇన్యూరెన్స్ కవరేజీ ఎలాంటిదో తెలుసుకోవాలి. నీటిలో మునిగిన కార్లలో ముఖ్యంగా కారు ఇంజిన్, గేర్ బాక్స్ డ్యామేజ్ అవుతుంటాయి. ఇవి ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయో లేదో తెలుసుకోవాలి. వరదల్లో కారు మునిగినట్లైతే వెంటనే ఇన్యూరెన్స్ అధికారులను సంప్రదించడం ఉత్తమం. కారుకు సంబంధించిన ఫొటోలను ఇన్సూరెన్స్ ఆఫీస్ కు పంపించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కంపెనీ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను పంపుతుంది. దీని సాయంతో ఇన్సూరెన్స్ వివరాలను తెలుసుకోవచ్చు.

Cars water insurance

కారు డ్యామేజీని ఇలా లెక్కిస్తారు:

వరదల్లో మునిగిన కారును ఇన్సూరెన్స్ కంపెనీ రిపేర్ షాపుకు తరలిస్తుంది. అప్పుడు వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, ఇతర ఒరిజినల్ కాపీలను అందించాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ సర్వేయర్ కారును పరిశీలించి ఎంత మేరకు దెబ్బతిన్నది.. ఏయే భాగాలు మార్చాలి? మరమ్మతులు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనేది లెక్కిస్తారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ సదరు వాహనదారుడికి జీమెయిల్, మెసేజ్ ల రూపంలో చేరవేస్తుంది.

బీమా సొమ్ము ఎంత వస్తుంది:

కారులో దెబ్బతిన్న భాగాలకు ఇన్సూరెన్స్ వస్తుంది. అయితే ఇన్సూరెన్స్ వర్తించని భాగాలకు కూడా లెక్కగట్టి చెబుతారు. దీనికి మీరు ఓకె చెప్తే కారు రిపేర్ స్టార్ట్ అవుతుంది. కారు రిపేర్ పూర్తయ్యాక దానికి అయ్యే మొత్తాన్ని కంపెనీ నేరుగా రిపేర్ చేసిన వారికి చెల్లిస్తుంది. ఒక వేళ కారు పరిస్థితి పనికిరాని స్థితిలో ఉంటే అప్పుడు కారు వ్యాల్యూని బట్టి ఎంత చెల్లించాలో కంపెనీ నిర్ణయిస్తుంది. దానికి సదరు వాహనదారుడు ఓకే చెప్తే డబ్బు చెల్లిస్తుంది. కారు లోను కింద ఉన్నట్లైతే అప్పుడు అసలైన యజమానికే ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లిస్తుంది.