iDreamPost
android-app
ios-app

ఈసారి ఛాంపియన్ తో రోషన్ సరికొత్తగా..

  • Published Dec 19, 2025 | 12:39 PM Updated Updated Dec 19, 2025 | 12:39 PM

పెళ్లి సందడితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ వారసుడు రోషన్. అనుకున్నంత రేంజ్ లో డెబ్యూ మూవీ హిట్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత రోషన్ సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఒకటి రెండు ప్రాజెక్ట్స్ ఓకే అయ్యి ఆగిపోయిన అదే వైజయంతి బ్యానర్స్ తో రెండు అడుగు వేస్తున్నాడు.

పెళ్లి సందడితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ వారసుడు రోషన్. అనుకున్నంత రేంజ్ లో డెబ్యూ మూవీ హిట్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత రోషన్ సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఒకటి రెండు ప్రాజెక్ట్స్ ఓకే అయ్యి ఆగిపోయిన అదే వైజయంతి బ్యానర్స్ తో రెండు అడుగు వేస్తున్నాడు.

  • Published Dec 19, 2025 | 12:39 PMUpdated Dec 19, 2025 | 12:39 PM
ఈసారి ఛాంపియన్ తో రోషన్ సరికొత్తగా..

పెళ్లి సందడితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ వారసుడు రోషన్. అనుకున్నంత రేంజ్ లో డెబ్యూ మూవీ హిట్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత రోషన్ సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఒకటి రెండు ప్రాజెక్ట్స్ ఓకే అయ్యి ఆగిపోయిన అదే వైజయంతి బ్యానర్స్ తో రెండు అడుగు వేస్తున్నాడు. ఈ సినిమా పేరు ఛాంపియన్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

ఇప్పటివరకు సినిమా గురించి ఏ ఒక్క విషయం కూడా బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు టీం . ఇక ఇప్పుడు ఒకేసారి ట్రైలర్ రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. ఈ సినిమాను డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ ను గమనిస్తే.. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా.. తెలంగాణ లో ఉండే భైరాన్ పల్లి ఇంకా రజాకార్ల చేతుల్లోనే ఉంటుంది. ఆ ఊరిలో ఎవరు ఎదురు తిరిగినా వాడికి మరణమే . ఇక అదే గ్రామంలో రోషన్ ఫుట్ బాల్ ఆట ద్వారా విదేశాలకు వెళ్లాలని అనుకుంటాడు. కానీ ఆ ఊరి కట్టుబాట్ల వలన అతను ఎక్కడికి కదలలేక పోతాడు.

ఇక అదే ఊరిలో నాటకాలు వేసుకునే అమ్మాయి అనస్వర రాజన్ .. ఈమెను రోషన్ ప్రేమించడం ద్వారా యుద్ధ భూమిలో అడుగు పెట్టె పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది ? బ్రిటిషర్లు వెళ్లిపోయిన తర్వాత కూడా అక్కడ ఎందుకు ఘోరాలు జరిగాయి ? ఇవన్నీ తెలియాలంటే డిసెంబర్ 25న ఈ సినిమా చూడాల్సిందే. రోషన్ కు ఈ సినిమా మంచి హిట్ ను అందిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అతని యాక్టింగ్ లో చాలానే ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.