P Venkatesh
AP School Holidays: ఏపీలో వర్షాలు మళ్లీ దంచి కొట్టనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు ఈ జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
AP School Holidays: ఏపీలో వర్షాలు మళ్లీ దంచి కొట్టనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు ఈ జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
P Venkatesh
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ నగరం వరద నీటిలో చిక్కుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తీవ్ర వర్షాలతో అల్లాడిపోతున్నాయి. ఇక శాంతించు వరుణ దేవా అని ప్రజలు వేడుకుంటున్నారు. అయినా వానలు వదిలేలా లేవు. ఏపీకి మరో అల్పపీడనం పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు ఈ జిల్లాలోని పాఠశాలలకు సెలవును ప్రకటించింది.
ఏపీలోని ప్రజలు వర్షాలు, వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ లోపే మరో అల్పపీడనం భయపెడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో ఉత్తరం వైపు కదిలే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా శుక్రవారం స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వానలు మళ్లీ కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలకు అవసరమైన ఆహారం, నీరు పంపిణీ చేస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు.