ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయానికి దోహదం చేసిన కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది విద్యా వ్యవస్థలో సంస్కరణలు. కార్పొరేట్ స్కూళ్లను మించిన స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చింది ఆప్ ప్రభుత్వం. ఈ విద్యా విధానం దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆకర్షించింది. ఎన్నో ప్రత్యేక బందాలు వెళ్లి.. అక్కడి ప్రభుత్వ పాఠశాలలను పరిశీలిస్తుంటాయి. ఇప్పుడు ఏకంగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలపై […]
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ 16న ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేజ్రీవాల్‌తోపాటు కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున కదిలిరావాలని ఆప్ నేతలు పిలుపునిచ్చారు. అంతకుముందు కేజ్రీవాల్ కొత్తఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ […]
ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవడం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. ఈనేపధ్యంలో ఢిల్లీ పిసిసి ఇంచార్జ్ గా ఉన్న పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒకప్పుడు వరుసగా 3 సార్లు విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరుస పరాభవాలు చవిచూస్తూ పరువు పోగొట్టుకుంటుంది. మాజీ సియం దివంగత నేత షీలా దీక్షిత్ హాయాంలోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని పీసీ చాకో విమర్శలు చేశారు. […]
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సొంతం చేసుకుని సంబరాలు చేసుకుంటున్న వేళ.. ఆ పార్టీ ఎమ్మెల్యే లక్ష్యంగా జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. ఆప్ తరఫున మెహరోలి నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే నరేశ్‌యాదవ్ ప్రయాణిస్తున్న వాహణ శ్రేణిపై గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి కాల్పులు జరిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం తన సహచరులతో కలసి ఆలయానికి వెళ్లి పూజలు చేసి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మొత్తం నాలుగు […]
ఢిల్లీలో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అరవింద్ కేజ్రీవాల్ దక్కించుకోవడం చిన్న విషయం కాదు. మోడీ-షా కొలువై ఉన్న దేశ రాజధానిలో వరుసగా రెండోసారి ఆ జంటను మట్టికరిపించడంతో కేజ్రీవాల్ క్రేజ్ అమాతంగా పెరుగుతుందనడంలో సందేహం లేదు. అపర ఛాణిక్యుడిగా అభిమానులు పిలుచుకునే అమిత్ షా ఎంతగా ప్రయత్నించినా అంతుచిక్కకుండా విజయబావుటా ఎగురువేసిన ఆప్ విజయ రహస్యంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. సంక్షేమ పథకాలు, కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్, గుజరాత్-ఢిల్లీ మోడల్ అభివృద్ధిపై చర్చ అంటూ పలు […]
ఢిల్లీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారో అని టెన్షన్ తో టీవీ చూడటం మొదలుపెట్టింది దేవి.. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పినట్లు AAP అధికారంలోకి వస్తుందా ? లేక “మోషా”మ్యాజిక్ తో బీజేపీ అధికారంలోకి వస్తుందా అన్న ఆలోచన దేవి మనసులో తిరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో AAP ఘన విజయం సాధించింది.. బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యింది. దాంతో నాయకులు ఢిల్లీ ఎన్నికల విషయంలో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఒక్కొక్కరికి వాట్సాప్ లో మెసేజ్ చేసింది […]
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈసారి ఎలాగైనా అధికారంలోకి కైవసం చేసుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డి పోరాడినప్పటికీ ఈరోజు విడుదలౌతున్న ఫలితాలలో AAP భారీ మెజారిటీతో విజయం సాధించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు బిజెపికి వ్యతిరేకంగా ఒక్కసారిగా తమ స్వరాన్నిపెంచాయి. తాజాగా బిజెపి ఓటమి రూపంలో మోడీపైనా పోరాడడానికి కాంగ్రెసేతర విపక్షాల చేతికి ఆయుధం దొరికినట్టయింది. ఈనేపథ్యంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఉదయం […]
ఢిల్లీ శాసన సభ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 63 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ ఏడు సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌటింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ సాగింది. ఉదయం నుంచి ఫలితాల సరళి ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగానే సాగింది. అందరూ ఊహించనట్లుగానే ఆప్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ రెండంకెల సంఖ్య చేరుకుంటుందని ఆశించిన ఆ పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ ఫలితాలు […]
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కే జ్రీవాల్‌కు న్యూఢిల్లీ శాసన సభ నియోజకవర్గం కంచుకోటగా అవతరించింది. ఈ రోజు వెలువడిన ఫలితాల్లో కేజ్రీవాల్ ఈ నియోజకవర్గం నుంచి మరో సారి గెలుపుబావుటా ఎగురవేశారు. 13, 508 ఓట్ల మెజారిటీ సాధించారు. వరుసగా మూడు ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి హాట్రిక్ కొట్టారు. న్యూఢిల్లీ ఓటర్లు ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌పై అంచెలంచెల విశ్వాసం చూపారు. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన […]
AAP ని ఢిల్లీ ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ సర్వ శక్తులు ఒడ్డినా AAP విజయాన్ని అడ్డుకోలేక పోయింది.. దేశ రాజధానిలో పాగా వేయాలన్న మోడీ అమిత్ షా ఆశలపై ఢిల్లీ ఓటర్లు నీళ్లు చల్లారు.. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమైన ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఢిల్లీ శాసనసభను రద్దు చేశారు. సాంప్రదాయం ప్రకారం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించనున్నారు. అయితే AAP గెలిచినా సరే ఆ పార్టీలో […]