iDreamPost
iDreamPost
కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి దూసుకెళ్లిన AAP ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 36 స్థానాలను గెలిచింది. దీనితో కేజ్రీవాల్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఇక లాంఛనమే.
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఇప్పటి వరకు ప్రకటించిన 40 స్థానాలకు గాను AAP 38 స్థానాలలో విజయం సాధించి మరో 22 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 2 స్థానాలలో గెలిచి 8 స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
AAP ముఖ్యనాయకుల్లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మొదట వెనకంజలో ఉన్నా ప్రస్తుతం 2500 మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నాడు. కేజ్రీవాల్ తో సహా AAP ముఖ్యనాయకులందరు గెలుపుబాటలో ఉన్నారు.
ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ మరోసారి సింగల్ డిజిట్ స్థానాలకే పరిమితం అవుతుంది. కాంగ్రేస్ ను ఢిల్లీ మర్చిపోయినట్లే…