దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకుని ఆయనతో అమిత్ షా సమావేశం అయ్యారు. దేశంలో కరోనా తీవ్రత, లాక్డౌన్ తదితర అంశాలపై మోడీతో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన అమిత్ షా లాక్‌డౌన్‌పై వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం జరిగిన ఈ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. గడిచిన 24గంటల్లో దేశంలోనే […]
కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి విధించిన రెండు నెలల లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం నష్టపోయిందని, అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంకా దీనిని గ్రహించలేదని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ఇంటికి తిరిగి వెళ్ళిన వలస కార్మికులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవనోపాధిని కోల్పోయిన ప్రజలు ఎక్కువగా నష్టపోయారని ఆమె అన్నారు. భారత దేశం వలస కార్మికుల బాధను చూసిందని, కానీ బిజెపి మాత్రం చూడలేని ఎద్దేవా చేశారు. కోవిడ్ […]
కరోనా కష్ట కాలంలో దేశ ఆర్థిక అభివృద్ధి కోసం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ లో పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి కేటాయింపులు ఉండబోవని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సంకేతాలిచ్చారు. నిన్న మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ కి సంబంధించిన కొన్ని వివరాలను ఈరోజు వెల్లడించారు. 20 లక్షల కోట్లను 15 రకాలుగా కేటాయింపులు చేశామని వెల్లడించిన […]
కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ తో మందగించిన దేశ ఆర్థిక వృద్ధి తోడ్పాటుకు నిన్న మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని సంబంధించిన వివరాలను కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. 20 లక్షల కోట్ల రూపాయలను 15 రకాలుగా విభజించామని మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఈ రోజు నుంచి ఆర్థిక ప్యాకేజీ లోని అంశాలను ఒక్కొక్కటిగా […]
దేశ ఆర్థిక వృద్ధి పెంచి, స్వయంసమృద్ధి భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. నవభారత్ నిర్మాణమే ఆత్మ నిర్భర భారత్ లక్ష్యమని చెప్పారు. భారత స్వయం పూర్వకంగా ఎదగాలనేదే తమ లక్ష్యమన్నారు. వివిధ స్థాయిల్లో సంప్రదించాక ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని తెలిపారు. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ అనే ఐదు మూల సూత్రాల ఆధారంగా ఆత్మ నిర్బర్ […]
మరో ఐదు రోజుల్లో మూడో విడత లాక్ డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ.. లాక్ డౌన్ పొడిగించాలా లేదా అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా వైరస్ ను గ్రామాలకు వ్యాపించకుండా చేయాలని సూచించారు. లాక్ […]
దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. కరోనా వైరస్ కట్టడి, లాక్ డౌన్ అనంతరం పరిణామాల పై ప్రధాని మోదీ ముఖ్య మంత్రులతో చర్చిస్తున్నారు. ఈనెల 17వ తేదీన మూడో విడత లాక్ డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాత్రి వరకు రెండు విడతల్లో ఈ సమావేశం కొనసాగనుంది. 17వ తేదీ తర్వాత లాక్ డౌన్ కొనసాగించాలా లేదా సడలింపు […]
కరోనా వైరస్ ప్రభావంపై రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతుంది. ఆయా రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి,లాక్డౌన్ అమలు చేస్తున్న తీరు గురించి చర్చిస్తున్నారు.అయితే ఇవాళ్టి ఐదవ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శల బాణాలు సంధించారు. బెంగాల్ సీఎం దీదీ మాట్లాడుతూ కరోనా అంశంపై కేంద్రం రాజకీయాలు చేస్తుందని రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతోందని ఆరోపించారు. […]
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈనెల 17వ తేదీన మూడో విడత లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ముఖ్య మంత్రులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ నుంచి అనేక అంశాలకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం 17వ తేదీతో ముగియనున్న మూడో విడత లాక్ డౌన్ తర్వాత మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. ప్రజల రోజువారీ కార్యకలాపాలు, […]
దేశవ్యాప్తంగా మరో సారి లాక్ డౌన్ పొడిగించడం తో ప్రధాని నరేంద్ర మోడీ రేపు ప్రజల ముందుకు రానున్నారు. జాతినుద్దేశించి రేపు శనివారం ఉదయం 10 గంటలకు ప్రసంగించనున్నారు. ఎల్లుండి ఆదివారం తో లాక్ డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రేపు లేదా ముగిసే రోజైన మే 3వ తేదీన ప్రధాని మోదీ లాక్ డౌన్ పొడిగింపు పై ప్రకటన చేసి జాతినుద్దేశించి ప్రసంగిస్తారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఐతే ఈ రోజు శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ […]