iDreamPost
android-app
ios-app

నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.. ఎందుకంటే..?

నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.. ఎందుకంటే..?

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈనెల 17వ తేదీన మూడో విడత లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ముఖ్య మంత్రులతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ నుంచి అనేక అంశాలకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం 17వ తేదీతో ముగియనున్న మూడో విడత లాక్ డౌన్ తర్వాత మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు అవకాశం ఉంది.

ప్రజల రోజువారీ కార్యకలాపాలు, దుకాణాలు, పరిశ్రమల నిర్వహణకు ఇప్పటికే అనుమతించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రజా రవాణాకు కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఆయా రాష్ట్రాల్లో ప్రజా రవాణా వ్యవస్థ తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 17వ తేదీ తరువాత లాక్ డౌన్ ఎత్తి వేసే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ అనంతర పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రోజు వారి పరిపాలనకు కూడా నిధులు లేక సతమతం అవుతున్నాయి. తమను ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి వినతుల సమర్పించాయి. ఎఫ్ఆర్బీఎం పరిమితి ఎత్తివేత, రుణాల వాయిదాల చెల్లింపు పై తాత్కాలిక మారటోరియం విధించాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తోంది ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఈ వైరస్ ప్రజలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది ఈ పరిస్థితుల్లో ఓ వైపు పటిష్టమైన చర్యలు తీసుకుంటేనే అదే సమయంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు లాక్ డౌన్లోడ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య మంత్రులతో సమావేశం కావడం ఇది ఐదవసారి.