Idream media
Idream media
కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ తో మందగించిన దేశ ఆర్థిక వృద్ధి తోడ్పాటుకు నిన్న మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని సంబంధించిన వివరాలను కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. 20 లక్షల కోట్ల రూపాయలను 15 రకాలుగా విభజించామని మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఈ రోజు నుంచి ఆర్థిక ప్యాకేజీ లోని అంశాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తామని తెలిపారు.
ఈ రోజు 4.40 లక్షల కోట్ల కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ రోజు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పార్ట్ – 1 లో మూడు లక్షల కోట్ల రూపాయలు సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు కేటాయించారు. మరో 90 వేల కోట్ల రూపాయలు విద్యుత్ పంపిణీ సంస్థలకు కేటాయించారు. ప్రత్యక్ష పన్నులు చెల్లించే వారి కి టిడిఎస్ లో 25 శాతం మేర కోత విధించడం ద్వారా మరో 50 వేల కోట్ల రూపాయలు ప్రజలకు దక్కుతాయని మంత్రి సీతారామన్ తెలిపారు.
నిర్మలా సీతారామన్ తెలిపిన ప్రకారం ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో అనేక పార్ట్ లు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రేపు పార్ట్ 2 లో ఏ ఏ అంశాలు ఉంటాయో వేచి చూడాలి.