మనిషి పుట్టకేపుట్టినా గానీ.. లోపలి బుద్ది ఎలా ఉంటుందో చూసి చెప్పడం కష్టం. సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి పోటీగా డబ్బుచుట్టూ మనిషి తిరగడం ప్రారంభించాక కొందరి మనుష్యుల బుద్దులు 360 డిగ్రీల వక్రమార్గం పట్టిపోతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ విపరీత పోకడలను సామాజికవేత్తలు నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా విని తలకెక్కించుకునే తీరిక ‘కొందరి’కి ఉండడం లేదు. ఇక్కడ మనిషినే పూర్తిగా అనలేం, ఆ బుద్దిపుట్టే అవకాశాన్ని కల్పిస్తున్న పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తే.. మనిషిని నిందించాలా? […]
ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చారు. ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడును పరామర్శించేందుకు చంద్రబాబు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వడం సాధ్యం కాదంటూ అధికారులు చెప్పారు. ఈ క్రమంలో జీజీహెచ్ సూపరిండెంటెండ్‌తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు అచ్చెం నాయుడు ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆస్పత్రి ముందు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఎప్పటిలాగే ప్రభుత్వంపై విమర్శలు […]
పైల్స్ తో బాధపడుతున్న అచ్చెన్నాయుడిని హాస్పిటల్ తరలించిన పోలీసులు . పరామర్శించటానికి వస్తున్న బాబు . ESI కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా నిర్ధారించి నిన్న ఉదయం అరెస్ట్ చేసిన మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుని రాత్రికి విజయవాడ ఏసీబీ ఆఫీసుకి తరలించడం తెలిసిందే . అయితే పైల్స్ తో బాధపడుతూ ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడుకి రక్తస్రావం కావడంతో ఏసీబీ పోలీసులు ESI హాస్పిటల్ నుండి డాక్టర్స్ ని పిలిపించడం వారు పైల్స్ పరిశీలించి రక్తస్రావం కాకుండా […]
కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 10 వేలకు పైగా కేసులు, 300 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. కానీ నిన్న తొలిసారిగా 11 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 11,458 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 386 మరణాలు సంభవించాయి. ఇప్ప.దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య […]
కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ సడలింపులు పెరగడంతో దేశం కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా కేసుల విషయంలో ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో స్థానంలో భారత దేశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నరు. ఈ నెల 16, 17 (మంగళ, బుధ వారాల్లో) తేదీల్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ […]
కరోనా అలియాస్ కోవిడ్ 19 వచ్చింది మొదలు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సరికొత్త విషయాలను నేర్పుతోంది. ఇప్పటి వరకు వైద్యరంగం అనుసరిస్తున్న విధానాలతో పాటు, సామాజిక వ్యవహారశైలిని కూడా మార్చేస్తోంది. ఈ వ్యాధి చికిత్సలో వైద్య వర్గాలు చేపడుతున్న ప్రతీ చర్యా మొట్టమొదటిదే అయ్యుంటుంది. ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఆతృతతో ప్రపంచ ఆరోగ్య సంస్థలాంటి వ్యవస్థలు కూడా అతి జాగ్రత్తలకు పాటించాయి. రానురాను తమ నిర్ణయాలను సమీక్షించుకుని సరళతరం చేస్తున్నాయి. వాటికి అనుగుణంగానే ఐసీయంఆర్ వంటి సంస్థలు […]
ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచే ప్రజా రవాణా అందుబాటులోకి రానున్నది. దాదాపు అరవై రోజుల తరువాత ఆర్టీసి బస్సులు రోడ్డుపై రైట్ రైట్ అంటూ ముందుకు సాగనున్నాయి. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి కట్టడికి కేంద్రద ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌తో దాదాపు రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన బస్సులు రేపటి (గురువారం) నుంచి ప్రయాణికులను గమ్యం చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు బస్సులు డిపోల నుంచి బస్టాండ్లకు చేరనున్నాయి. అప్పటికే […]
దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అమలు అయిన కొన్ని రోజులకు వలస కార్మికులు సమస్యలు దేశం ముందుకు వచ్చింది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు షెల్టర్ లేక, ఆహారం లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే వారంతా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పయణమైయ్యేందుకు యత్నిస్తున్నారు. వందల కిలో మీటర్లు నడుచుకుంటూ, సామాగ్రిని నెత్తిపై పెట్టుకుంటూ, పసి పిల్లలను చెంకని వేసుకొని ఎర్రటి ఎండలలో తమ గ్రామాలకు పయణమైయ్యారు. […]
డబ్బులు ఊరికే రావంటూ ప్రకటనలతో ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న లలిత జువెలర్స్ ఎండి కిరణ్ కుమార్ తన ఉదారతను చాటుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకరించారు. కష్టపడి సంపాదించిన”డబ్బులు ఊరికే రావు” కాబట్టి నగలు, బంగారం విషయంలో జాగ్రత్తగా ఖర్చుపెట్టండి అంటూ కిరణ్ కుమార్ స్వయంగా చేసిన ప్రకటనలు ప్రజల ఆదరణను దక్కించుకున్నాయి. దానితో పాటు ఆయన చేసిన ప్రకటనకు పేరడీగా అనేక కామెడీ సీన్లు కూడా రూపొందాయి. కాగా డబ్బులు ఊరికే రావంటూ […]
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు మూడువేల పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతుండడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. నిన్న ఒక్కరోజులో 4,296 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల 67,270 చేరింది. కాగా కరోనా కారణంగా 2,213 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 20,981 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ […]