iDreamPost
android-app
ios-app

దేశంలో ఒక్కరోజులో 4,296 పాజిటివ్ కేసులు

దేశంలో ఒక్కరోజులో 4,296 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడచిన కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు మూడువేల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతుండడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. నిన్న ఒక్కరోజులో 4,296 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో  దేశంలో కరోనా పాజిటివ్ కేసుల 67,270 చేరింది. కాగా కరోనా కారణంగా 2,213 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 20,981 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 44,072 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి.నిన్న ఒక్కరోజులోనే 1943 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో 22,171 పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి.కరోనా కారణంగా 832 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 13,739 దాటగా పుణెలో 2,679 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో 1,196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 415 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 751 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 30 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతిన్నాయి. గడచిన 24 గంటల్లో 50 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. 1980 మందికి కరోనా సోకగా 45 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1010 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 4,181,077 మందికి కోవిడ్ 19 సోకగా 283,868 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,493,416 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,367,638 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 80,787 మంది మరణించారు.