Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కరెన్సీ నోట్ల ద్వారా వ్యాప్తి చెందుతుందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.తూర్పు గోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాలో కొంతమందికి నోట్ల ద్వారా కోవిడ్ -19 సోకినట్లు అధికారులు ప్రకటించారు తూర్పు గోదావరి,కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా,కరోనా సోకిన వ్యక్తులను కాకపోయినా కూడా నలుగురు వ్యక్తులకు కోవిడ్ -19 సోకింది. దీంతో ప్రైమరీ,సెకండరీ కాంట్రాక్ట్ లు లేకుండా కోవిడ్ -19 సోకడానికి గల కారణాలను అన్వేషించినప్పుడు ఈ దిగ్భ్రాంతికర అంశం వెలుగు చూసింది.
నగదు లావాదేవీలను నివారించాలని,ఆన్‌లైన్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ సోకుతుండటంతో అప్రమత్తమైన అధికారులు నిత్యావసర వస్తువులు కొన్న తర్వాత నగదు చెల్లించకుండా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.ఈ సమయంలో డాక్టర్ల వద్దకు వెళ్లినప్పుడు వారికి చెల్లించే ఫీజు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి కోరుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ డీఐజీ కార్యాలయం కరెన్సీ వాడకంపై ప్రజలకు కొన్ని సూచనలు చేస్తూ ఒక మెమో జారీ చేసింది. అందులో రెండు వారాల పాటు కరెన్సీ వాడకాన్ని నిలిపి వేయాలని ప్రజలకు సూచించింది. అలాగే కేబుల్ టీవీ, డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే వారు, పాలు పోసేవారు,పెట్రోల్ బంక్‌లు, కిరాణా షాపులు, కూరగాయలు,పండ్ల దుకాణాలు,మెడికల్ షాపులు విరివిగా కరెన్సీ వాడే ఇలాంటి ప్రదేశాలలో వినియోగదారులు అన్‌లైన్‌లోనే లావాదేవీలు జరపాలని సూచిస్తున్నారు.