మాది ధనిక రాష్ట్రం అని తరచూ చెప్పే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా దెబ్బ గట్టిగానే తగలింది. ఒక్క తెలంగాణాకే కాదు దేశం యావత్తూ ఆర్థిక వ్యవస్థ స్తంభించడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. నెలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రాష్ట్రాలకు గత మూడు నెలలుగా వందల కోట్ల రూపాయల లోపే రెవెన్యూ సమకూరుతోంది. అందుకే ఉద్యోగులు జీతాల్లో కోతలు, వాయిదాలు వేస్తూ నెట్టుకొస్తున్నాయి. ఇందుకు ఏ రాష్ట్రం కూడా మినహాయింపు […]
కరోనా కారణంగా ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో తిరగడం లేదు.. దీంతో రోజుకు 11 నుండి 12 కోట్ల ఆదాయం ఆర్టీసీకి రావాల్సి ఉండగా కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందని తెలంగాణ ఆర్టీసీ అధికారులు తెలిపడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనలను మినహాయింపు ఇచ్చారు. రాత్రి పూట కూడా ఆర్టీసీ సర్వీసులు నడుపుకోవచ్చని తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు ప్రస్తుతం జేబీఎస్‌లోనే ప్రయాణికులను దింపుతున్నాయి. ఇకపై జిల్లాల […]
ఏపీ ముఖ్యమంత్రిగా ఏడాది పదవీకాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో జగన్ దూకుడు పెంచుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తన భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి ఏడాది క్యాలెండర్ విడుదల చేశారు. అదే సమయంలో కరోనా మీద మరింత క్లారిటీకి ఇచ్చేశారు. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమయిన నాటి నుంచి ఆయన ముందుచూపు ప్రదర్శిస్తున్నారు. జగన్ తొలుత చెప్పిన రీతిలోనే ఆ తర్వాత అందరూ అనుసరించడం అనేక విధాలుగా స్పష్టం అయ్యింది. వాస్తవంగా చెప్పాలంటే లాక్ డౌన్ సడలింపు విషయంలో […]
నేటి నుండి ఆటోలు, క్యాబ్‌లు, సెలూన్లు, ఆర్టీసీ బస్సులు నడపవచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఈరోజు ఉదయం నుండి అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభమయ్యాయి. కాగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్న నిబంధన విధించారు. మాస్కులు లేని ప్రయాణికులను బస్సుల్లో ప్రయాణించేందుకు వీలులేదు. శానిటైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తూనే ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కాగా హైదరాబాద్ లో మినహా తెలంగాణాలో అన్ని చోట్ల ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం […]
నీటి వాటాలకు సంబంధించి కేసీఆర్, తెలంగాణకు పట్టిక సదృష్యమైన అవగాహణ ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కేటాయించిన నీళ్లకు తగినట్లుగానే ప్రాజెక్టులు కట్టామని స్పష్టం చేశారు. అందరూ అలాగే చేసుకోవాలని సూచించారు. పోతిరెడ్డిపాడుపై అరవీరభయంకరంగా పోట్లాడింది తానేనని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఇంగితం లేకుండా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. పాలమూరు– దిండి ఎత్తిపోతలపై అపెక్స్ కౌన్సిల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కౌన్సిల్ ముందు ఒప్పుకుని వెళ్లారని కేసీఆర్ చెప్పారు. ఆ మినిట్స్ కూడా ఉన్నాయని […]
ఫెడరలిజం స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం షరతులతో మంటగలుపుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచుతూ దరిద్రమైన ఆంక్షలు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రాలను బిక్షగాళ్ల మాదిరిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఉత్త డొల్లని, బోగస్ అని కేసీఆర్ అభివర్ణించారు. ఇందులో ప్రభుత్వం పెట్టేది లక్ష కోట్ల రూపాయలు కూడా లేదని జపాన్ నుంచి […]
తెలంగాణలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను కొద్దిసేపటి క్రితం కేసీఆర్ స్వయంగా వెళ్లడించారు. హైదరాబాద్ నగరం మినహా మిగతా ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకోవచ్చని సీఎం తెలిపారు. అన్ని మత, విద్యా సంస్థలు పూర్తిగా మూసివేసి ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. బార్లు, క్రీడా మైదనాలు, క్లబ్లులు, పార్క్‌లు బంద్‌లో ఉంటాయని చెప్పారు. మెట్రో రైల్ బంద్, కర్ఫ్యూ కొనసాగుతుందని […]
ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హఠాత్తుగా కృష్ణా జలాల అంశం తెరమీదకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన చేస్తున్న ప్రయత్నాలతో తెలంగాణాలో విపక్షం రాజకీయాలకు తెరలేపింది. చాలాకాలంగా కేసీఆర్ మీద విమర్శలకు అవకాశం లేక తల్లడిల్లిపోతున్న కాంగ్రెస్ కి అదో అస్త్రంగా మలచుకోవాలని ముచ్చటపడుతోంది. అదే సమయంలో ఏపీలో ప్రతిపక్షానికి ఈ పరిణామం మింగుడుపడడం లేదు. కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకి కోపం అన్న చందంగా తయారయ్యింది. దాంతో టీడీపీ, జనసేన నేతలకు […]
ఇప్పుడు పరిస్థితి మరీ సున్నితమైపోతుంది.ఒక నీటి ప్రాజెక్ట్ ప్రకటించగానే విమర్శల జడివాన కురుస్తుంది…దిగువ రాష్ట్రం ఏ ప్రాజెక్ట్ చేపట్టిన ఎగువ రాష్ట్రాలు అభ్యంతరాలు చెప్పటం సహజమైపోయింది…రాజకీయ పక్షాలు – ఏ సమస్య అయినా రాజకీయ కోణంలోనే ఆరోపణలుచేస్తున్నాయి. విషయంలోకి వెళ్లి పరిశీలించి, సాంకేతిక అంశాలు తరచి చూసి,గత అనుభవాలు,వాదనలను తెలుసుకొని మాట్లాడే పద్దతి ఇప్పుడు లేదు. పోతిరెడ్డిపాడుతో వివాదం ఏంటి? పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి […]
ఏపీలో జగన్ ఏమి చెప్పినా విమర్శించడం, తెలంగాణాలో కేసీఆర్ ఏది మాట్లాడిన మౌనంగా ఉండడం చంద్రబాబు కి అలవాటుగా మారింది. ఓటుకి నోటు కేసు నాటి నుంచి ఈ ప్రక్రియ ఆయన అలవాటు చేసుకున్నారు. చివరకు ఇప్పుడు రెండు నెలలుగా అక్కడే నివాసం ఉంటున్నప్పటికీ కేసీఆర్ విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. తానో జాతీయ పార్టీ అధ్యక్షుడినని చెప్పుకుంటూనే తన సొంతపార్టీ కార్యకర్తల శ్రేయస్సుని కూడా ఆయను ఖాతరు చేయడం లేదు. కేసీఆర్ కి ఆగ్రహం […]