iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

ఎట్టకేలకు తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

నేటి నుండి ఆటోలు, క్యాబ్‌లు, సెలూన్లు, ఆర్టీసీ బస్సులు నడపవచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఈరోజు ఉదయం నుండి అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభమయ్యాయి.

కాగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్న నిబంధన విధించారు. మాస్కులు లేని ప్రయాణికులను బస్సుల్లో ప్రయాణించేందుకు వీలులేదు. శానిటైజేషన్‌ ప్రక్రియ నిర్వహిస్తూనే ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కాగా హైదరాబాద్ లో మినహా తెలంగాణాలో అన్ని చోట్ల ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ లో సిటీ బస్సులు నడపకూడదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే బస్సు సర్వీసులు రాత్రి ఏడు గంటలకు నిలిపివేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒకవేళ ఒకవేళ అప్పటికే టిక్కెట్లు జారీ చేస్తే ఎనిమిది గంటల వరకు అనుమతి ఉంటుంది.

కరీంనగర్‌ వైపు నుంచి రాజధాని నగరానికి వచ్చే బస్సులు జేబీఎస్‌ వరకే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే బస్సులను హయత్‌నగర్‌ వరకు, మహబూబ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్‌ వరకు, వరంగల్‌ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్‌ చౌరస్తా వరకు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ డిపోల బస్సులు పహాడీ షరీఫ్‌ వరకు‌ అనుమతించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. బస్సు సర్వీసులు ప్రారంభం కావడంతో బస్సు స్టేషన్లకు ప్రయాణికుల రద్దీ పెరిగింది.

Jojobet GirişDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetJojobetMadridbetMadridbetgrandpashabetgrandpashabet girişJojobetcasibomgrandpashabetjojobetcasinomilyoncasinomilyonultrabetultrabetgrandpashabet girişcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel giriş