iDreamPost
android-app
ios-app

కేంద్రంపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌

కేంద్రంపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌

ఫెడరలిజం స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం షరతులతో మంటగలుపుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ దరిద్రమైన ఆంక్షలు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రాలను బిక్షగాళ్ల మాదిరిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఉత్త డొల్లని, బోగస్‌ అని కేసీఆర్‌ అభివర్ణించారు. ఇందులో ప్రభుత్వం పెట్టేది లక్ష కోట్ల రూపాయలు కూడా లేదని జపాన్‌ నుంచి వెలువడే ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ మేగజైన్‌ పేర్కొందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కరోనా ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో నగదు రాష్ట్రాల చేతుల్లోకి రావాలని కోరితే..సంస్కరణలు పేరుతో బిక్షగాళ్ల మాదిరిగా మార్చారని మండిపడ్డారు.