iDreamPost

విషాదం.. లిఫ్ట్ లో ఇరుక్కుని బాలుడు మృతి!

కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా వరకు లిఫ్టుల్లో చిన్నారులు ఇరుక్కొని చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా వరకు లిఫ్టుల్లో చిన్నారులు ఇరుక్కొని చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

విషాదం.. లిఫ్ట్ లో ఇరుక్కుని బాలుడు మృతి!

ప్రమాదాలు ఏ రూపంలో ముంచుకు వస్తాయో ఎవరూ ఊహించలేరు. కొంతమంది అన్నెం.. పున్నెం ఎరుగని చిన్నారులు తెలియకుండా ప్రమాదాల్లో చిక్కుకుంటూ చనిపోతున్నారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు పుట్టెడు దుఖఃంలో మునిగిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా బోరుబావుల్లో, నీటి సంపుల్లో అడుకుంటూ పడి చనిపోతున్నారు. ఇక పట్టణాల్లో అయితే లిఫ్టులు చిన్నారుల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. కళ్లు మూసి తెరిచేలోపే పిల్లలు కళ్లముందే విగతజీవులుగా మారిపోతున్నారు. సరిగ్గా అలాంటి సంఘటనే ఎల్బీ నగర్.. ఆర్టీసీ కాలనీలో జరిగింది. ఎంతో సంతోషంగా తమతో గడిపిన తమ కుమారుడు లిఫ్ట్‌లో చిక్కుకొని తీవ్ర గాయాలపాలై చనిపోవడంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల కొత్తగా నిర్మిస్తున్న భవన నిర్మాణాల్లో ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి. భవన నిర్మాణ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా.. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా తమ ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారు. ముఖ్యంగా అపార్ట్ మెంట్స్ నిర్మించే సమయంలో ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది బిల్డర్లు వాటిని లెక్కచేయకుండా నిర్మిస్తున్నారు. ముఖ్యంగా లిఫ్ట్ విషయంలో సరైన భద్రతా  ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఎల్బీ నగర్ లోని ఆర్టీసీ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా నిర్మిస్తున్న భవనం లిఫ్ట్ లో చిక్కుకొని బాలుడు చనిపోయాడు. ఆర్టీసీ కాలనీలో కొత్తగా ఒక అపార్ట్ మెంట్ నిర్మిస్తున్నారు. దానికి వాచ్ మెన్ గా నాగరాజు, అనురాధలు పనిచేస్తు అపార్ట్ మెంట్ కింద రూమ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే అనురాధ కొడుకు అక్షయ్ లిఫ్ట్ లోకి వెళ్లి అందులో చిక్కుకున్నాడు.

లిఫ్ట్ సరిగా పనిచేయకపోవడంతో గట్టిగా అరవడం మొదలు పెట్టారు. ఎలాగో అలా బాలుడిని బయటకు తీశారు.. అప్పటికే తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే అక్షయ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడిని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే తన కుమారుడిని తమకు చూపించకుండా పోస్ట్ మార్టం ఎలా తరలిస్తారని అక్షయ్ తల్లిదండ్రులు నాగరాజు, అనురాధ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఉప్పలాస్ రెసిడెన్సీ భవనంలో గత 20 రోజుల క్రితమే నాగరాజు దంపతులు వాచ్ మెన్ గా కుదిరారు. అప్పటి వరకు తమతో ఎంతో సంతోషంగా గడిపిన తమ కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో లిఫ్టుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి