iDreamPost

హర్ష సాయి అసలు వాయిస్ బయటపడింది! మీరు గమనించారా?

Harsha Sai Original Voice Revealed: ప్రస్తుతం హర్ష సాయి మీద ఇల్లీగల్ బెట్టింగ్ ఆరోపణల రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా తనపై వస్తున్న ఆరోపణలపై హర్ష సాయి స్వయంగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో హర్ష సాయి అసలు వాయిస్ బయటపడింది.

Harsha Sai Original Voice Revealed: ప్రస్తుతం హర్ష సాయి మీద ఇల్లీగల్ బెట్టింగ్ ఆరోపణల రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా తనపై వస్తున్న ఆరోపణలపై హర్ష సాయి స్వయంగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో హర్ష సాయి అసలు వాయిస్ బయటపడింది.

హర్ష సాయి అసలు వాయిస్ బయటపడింది! మీరు గమనించారా?

హర్ష సాయి తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన వ్యక్తి. తన మార్కు వీడియోలతో సంచలనం సృష్టిస్తూ అతి తక్కువ కాలంలోనే బీభత్సమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. మొదట్లో వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ వంటి హెల్త్ రిలేటెడ్ వీడియోస్ చేసేవారు. 20 లక్షల కారుని పూర్తిగా కాయిన్స్ తో కొనుగోలు చేసిన వీడియోతో ఒక్కసారిగా హర్ష సాయి బాగా ఫేమస్ అయ్యారు. హాంటెడ్ హౌస్ వీడియోస్ తో మరింత ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. ఇలా చిత్ర విచిత్ర వీడియోలతో ఆకట్టుకునేవారు. ఆ తర్వాత పేద ప్రజలకు ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషిన్ లు, టీవీలు వంటివి అందజేస్తూ మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు అని.. నాణానికి మరోవైపు ఉన్న హర్ష వేరే అని అనేక ఆరోపణలు వచ్చాయి.

యూట్యూబర్ యువసామ్రాట్ రవి హర్ష సాయి మీద అనేక ఆరోపణలు చేశారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారని హర్ష సాయి మీద ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రచ్చ నడుస్తోంది. ఈ క్రమంలో హర్ష సాయి బయటకు వచ్చారు. తన మీద వస్తున్న ఆరోపణల మీద స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన తన మీద వచ్చే ఆరోపణలను తిప్పికొట్టారు. పెద్ద పెద్ద వాళ్లతో పోలిస్తే తాను చేసేది చాలా చిన్నదని చెప్పుకొచ్చారు. కావాలని తనను కార్నర్ చేస్తున్నారని.. తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాగా ఆ ఇంటర్వ్యూలో హర్ష సాయి అసలు వాయిస్ బయటపడింది. ఇంటర్వ్యూలో ఒక ఫేజ్ వరకూ ఒకలా మాట్లాడిన హర్ష సాయి వాయిస్ ఒక్కసారిగా మారిపోయింది.

హర్ష సాయి వీడియోలు గమనించిన వారికి ఈ విషయం బాగా అర్థమవుతుంది. హర్ష సాయి వీడియోల్లో తన వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా ప్లెజెంట్ గా.. వీడియోలు చూసే ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసేలా ఉంటుంది. హర్ష సాయి వీడియోలు చూస్తే ఆ కంటెంట్ కంటే కూడా అతని వాయిస్ కే ఎక్కువ ఎట్రాక్ట్ అయిపోతారు. అంతలా హస్కీ వాయిస్ తో నొక్కి మాట్లాడతారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్ష సాయి ఒరిజినల్ వాయిస్ బయట పడింది. ఆ ఇంటర్వ్యూలో తాను వీడియోల్లో కాకుండా రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో అలానే మాట్లాడారు. ఒరిజినల్ వాయిస్ అదే. వీడియోస్ కోసం ప్రేక్షకులకు ఇంప్రెస్ చేయడం కోసం గొంతు కొంచెం మార్చి మాట్లాడతారు. కానీ రియల్  లైఫ్ కొచ్చేసరికి వాయిస్ వేరే ఉంటుంది. తన ప్రొఫెషన్ లో భాగంగా వీడియోల కోసం వాయిస్ మాడ్యులేషన్ అనేది మారుస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి