iDreamPost

బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు!

Good News To Bank Customers: ఆర్బీఐ కొత్త నిబంధనలతో బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్బీఐ ఆదేశాలతో బ్యాంకులు కీలక మార్పులు చేశాయి. దీంతో కస్టమర్లకు భారీ ప్రయోజనం చేకూరనుంది.

Good News To Bank Customers: ఆర్బీఐ కొత్త నిబంధనలతో బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్బీఐ ఆదేశాలతో బ్యాంకులు కీలక మార్పులు చేశాయి. దీంతో కస్టమర్లకు భారీ ప్రయోజనం చేకూరనుంది.

బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు!

ఈ మధ్య బ్యాంకులు కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. మారిన ఈ రూల్స్ తో కస్టమర్లకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఎస్బీఐ బ్యాంక్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్స్ ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ లావాదేవీలు జరిపితే రివార్డ్ పాయింట్స్ వర్తించవని యూజర్స్ కి షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ కొత్త నిబంధన జూలై 15 నుంచి అమలులోకి రానుంది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డుల విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు రీప్లేస్ మెంట్ రుసుమును పెంచింది. జూలై 1 నుంచి ఆ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇలా పలు బ్యాంకులు కొత్త రూల్స్ తో కస్టమర్లను షాక్ కి గురి చేస్తున్నాయి.

రీసెంట్ గా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా కస్టమర్లకు షాకిచ్చింది. యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ లను పంపే విషయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ ద్వారా ఎవరైనా వంద రూపాయల కంటే తక్కువ పంపితే ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించి టెక్స్ట్ మెసేజులు ఫోన్ కి పంపించడం కుదరదని తెలిపింది. అంతేకాదు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలో 500 రూపాయల కంటే తక్కువ అమౌంట్ ఉన్నా కూడా సందేశాలు రావని వెల్లడించింది. ఈమెయిల్ ద్వారా మాత్రమే లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని పొందుతారని తెలిపింది. దీంతో ఖాతాదారులకు పెద్ద షాక్ తగిలినట్లైంది. ఇలా బ్యాంకులు వరుసగా కస్టమర్లకు షాకిస్తుంటే.. ఆర్బీఐ కొత్త రూల్స్ తో అలాంటి కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే కస్టమర్లకు ఇక నుంచి అధిక వడ్డీ రేటు అందనుంది. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై మార్పులు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ని ప్రతిపాదించింది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం బ్యాంకుల్లో 3 కోట్లు లేదా అంతకు మించి చేసే డిపాజిట్లను బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లుగా పరిగణించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంతకు ముందు 2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఫిక్డ్స్ డిపాజిట్లను బల్క్ డిపాజిట్లుగా పరిగణించేవారు. ఇప్పుడు 3 కోట్ల నుంచి బల్క్ డిపాజిట్లుగా పరిగణించడంతో కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు 3 కోట్ల వరకూ రిటైల్ డిపాజిట్లుగానే పేర్కొంటూ బ్యాంకులు నోటిఫికేషన్ ఇచ్చాయి. దీంతో కస్టమర్స్ కి మేలు జరగనుంది.

బల్క్ డిపాజిట్ల కంటే కూడా రిటైల్ డిపాజిట్లపైనే వడ్డీ అధికంగా వస్తుంది. ఎవరైతే 2 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల మధ్యలో డిపాజిట్ చేస్తారో వారికి వడ్డీ ఎక్కువ వస్తుంది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ సహా పలు బ్యాంకులు ఆర్బీఐ ఆదేశాల మేరకు కీలక మార్పులు చేశాయి. ఎస్బీఐ ఇప్పటికే రిటైల్ టర్మ్ డిపాజిట్ పరిమితిని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా రిటైల్ టర్మ్ డిపాజిట్ పరిమితిని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్, ఆర్బీఎల్, యెస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా రిటైల్ డిపాజిట్ పరిమితిని 3 కోట్లకు పెంచాయి.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి