iDreamPost

సెమీస్ కు ముందు టీమిండియాపై రాస్ టేలర్ షాకింగ్ కామెంట్స్! ఏమన్నాడంటే?

  • Author Soma Sekhar Published - 09:38 AM, Tue - 14 November 23

ఇండియా-న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు భారత జట్టును రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు కివీస్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్.

ఇండియా-న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు భారత జట్టును రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు కివీస్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్.

  • Author Soma Sekhar Published - 09:38 AM, Tue - 14 November 23
సెమీస్ కు ముందు టీమిండియాపై రాస్ టేలర్ షాకింగ్ కామెంట్స్! ఏమన్నాడంటే?

వరల్డ్ కప్ 2023లో కీలక మ్యాచ్ కు మరికొన్ని గంటల్లో తెరలేవబోతోంది. ఈ మ్యాచ్ లో ప్రపంచ కప్ హాట్ ఫేవరెట్ టీమిండియాతో తలపడనుంది న్యూజిలాండ్. నవంబర్ 15న వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాపై మాటల యుద్ధానికి దిగాడు కివీస్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్. భారత ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేశాడు ఈ కివీస్ మాజీ ప్లేయర్. అయితే అతడు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా గానీ..2019 సెమీస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.

వరల్డ్ కప్ లో తిరుగులేని విజయాలతో టీమిండియా దూసుకెళ్తోంది. లీగ్ దశలో 9 మ్యాచ్ లకు గాను 9 గెలిచి.. దర్జాగా సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఇక సెమీస్ లో న్యూజిలాండ్ ను ఢీకొనబోతోంది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో సెమీస్ కు ముందు కివీస్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రాస్ టేలర్ టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు.”సెమీస్ లో కివీస్ తో తలపడుతున్న భారత్ ఆందోళనకు గురవుతోంది. దానికి కారణం 2019 సెమీస్ లో ఓటమే. ఇక లీగ్ దశలో తిరుగులేని విజయాలు సాధించడం కూడా ఇండియాను కలవరపెడుతోంది. గత మ్యాచ్ ల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆ జట్టు తర్వాతి మ్యాచ్ లో కూడా అంతే ప్రదర్శన ఇవ్వాలన్న ఒత్తిడిలో ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. న్యూజిలాండ్ ఎప్పుడూ ప్రమాదకరమైన జట్టే. ఎప్పుడైనా ఓ మ్యాచ్ కు ముందు టీమిండియా భయపడుతుందంటే.. దాని ప్రత్యర్థి న్యూజిలాండ్ అని అర్ధం” అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు రాస్ టేలర్.

ఇక మ్యాచ్ స్టార్టింగ్ లోనే టీమిండియా వికెట్లు తీస్తే ఆ జట్టును ఒత్తిడిలోకి నెట్టొచ్చని తమ ప్లేయర్లుకు రాస్ టేలర్ సూచించాడు. భారత జట్టులో మెుదటి ముగ్గురు ప్లేయర్లే రాణిస్తున్నారని, వారిని తొలి 10 ఓవర్లలో ఔట్ చేస్తే.. ఆ జట్టును సులభంగా ఓడించ వచ్చని పేర్కొన్నాడు. కాగా.. ఈ మ్యాచ్ లో కివీస్ ఓడిపోయినా.. పోయేదేమీ లేదని తమ జట్టు పరువును తానే తీసుకునే విధంగా మాట్లాడాడు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కువగా పాక్ ఆటగాళ్లు మ్యాచ్ లకు ముందు చేస్తారని, కానీ ఈసారి న్యూజిలాండ్ ఆటగాళ్లు ఈ స్ట్రాటజీని వాడి.. టీమిండియా ప్లేయర్లను మానసికంగా దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. మరి టీమిండియాపై రాస్ టేలర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి