iDreamPost

Mohamed Muizzu: మాల్దీవులు అధ్యక్షుడిపై బ్లాక్ మ్యాజిక్..? మహిళా మంత్రి, ఆమె మాజీ భర్త అరెస్ట్

Performing Black Magic On President Mohamed Muizzu.. ఇటీవల వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచింది మాల్దీవులు. ఇండియా ఔట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన మహ్మద్ మయిజ్జూ.. చైనాకు దగ్గరవుతూ.. భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో పర్యాటక రంగంపై పెద్ద దెబ్బపడింది. తాజాగా

Performing Black Magic On President Mohamed Muizzu.. ఇటీవల వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచింది మాల్దీవులు. ఇండియా ఔట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన మహ్మద్ మయిజ్జూ.. చైనాకు దగ్గరవుతూ.. భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో పర్యాటక రంగంపై పెద్ద దెబ్బపడింది. తాజాగా

Mohamed Muizzu: మాల్దీవులు అధ్యక్షుడిపై బ్లాక్ మ్యాజిక్..? మహిళా మంత్రి, ఆమె మాజీ భర్త అరెస్ట్

ఇండియన్స్ ఇష్టపడే పర్యాటక ప్రాంతాల్లో ఒకటి మాల్దీవులు. కానీ గత ఏడాది నుండి నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తూనే ఉంది. హిందూ మహా సముద్రంలో ఉండే ఈ ద్వీప దేశంలో గత ఏడాది ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ముందు నుండే అక్కడ ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. ఇండియా ఔట్ నినాదంతో అధికారంలోకి వచ్చాడు మహ్మద్ మయిజ్జు. అతడు చైనాతో సత్సంబంధాలు కోరుకుంటూ ఇండియాపై విమర్శలు చేశాడు. అంతలో ప్రధాని మోడీ ఈ ఏడాది లక్షద్వీప్ సందర్శించి.. స్నార్కెలింగ్, సాహసం చేయాలనుకునే వారికి ఈ లోకేషన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పడంతో మాల్దీవుల మంత్రులు మోడీపై, భారత్ పై నోరు పారేసుకున్న సంగతి విదితమే.

దీంతో మాల్దీవుల పర్యటనకు వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గిపోయింది. పర్యాటక రంగంపైనే ఆధారపడుతోన్న ఈ ద్వీపదేశానికి ఆర్థికంగా నష్టం చేకూరింది. దీంతో వెనక్కు తగ్గింది మాల్దీవ్స్. భారత్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఉందని, శాంతి, స్నేహపూర్వక పరిస్థితులను పెంపొందించుకోవాలని ఆశిస్తున్నామని, దయచేసి మళ్లీ తమ పర్యాటకంలో భాగం కావాలని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి కోరారు. దీంతో వివాదం కాస్త సద్దుమణుగుతోంది అనుకున్న సమయంలో.. మరో వివాదం నెలకొంది. సొంత మంత్రులే.. దేశ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూపై బ్లాక్ మ్యాజిక్ చేసినట్లు స్థానిక మీడియా కోడై కూస్తుంది. పర్యావరణ, వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ఫాతిమా షమ్నాజ్ ఆలీ సలీం, ఆమె మాజీ భర్త , అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమీజ్‌లతో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ విషయాన్ని స్థానిక మీడియా ధ్రువీకరించింది. జూన్ 23న ఈ ఘటన వెలుగులోకి రావడంతో నలుగురు నిందితులను ఏడు రోజుల కస్టడీ రిమాండ్‌కు తరలించారు. ఫాతిమాను పర్యావరణ మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రిగా సస్పెండ్ చేసినట్లు స్థానిక మీడియా సంస్థ సన్ పేర్కొంది. అధ్యక్షుడు మయిజ్జాపై చేతబడి చేయించిందన్న ఆరోపణలపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, గతంలో మయిజ్జు మాలె సిటీ మేయర్‌గా విధులు నిర్వరిస్తున్నప్పుడు ఫాతిమా, రమీజ్ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పనిచేయడం గమనార్హం. అయితే ఈ అరెస్టులపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే అధ్యక్షుడి కార్యాలయం సైతం ఎటువంటి స్టేట్ మెంట్ రిలీజ్ చేయలేదు. ముస్లింలు మెజారిటీగా ఉన్న మాల్దీవులలో శిక్షాస్మృతి ప్రకారం చేతబడి అనేది క్రిమినల్ పెద్ద నేరంగా పరిగణించరు. అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ నేరానికి ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి