iDreamPost

‘కల్కి2898AD’ మూవీతో ప్రభాస్ అరుదైన రికార్డ్..!

కల్కి 2898 ఏడీ.. ఇండియన్ సినిమా నుంచి వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ కు అందిన ఐ ఫీస్ట్ ఈ సినిమా. తాజాగా ఈ మూవీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ అరుదైన అద్భుతమైన రికార్డును క్రియేట్ చేశాడు. దేశంలోనే ఆ రికార్డు కొట్టి ఒక్కే ఒక్కడిగా నిలిచాడు.

కల్కి 2898 ఏడీ.. ఇండియన్ సినిమా నుంచి వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ కు అందిన ఐ ఫీస్ట్ ఈ సినిమా. తాజాగా ఈ మూవీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ అరుదైన అద్భుతమైన రికార్డును క్రియేట్ చేశాడు. దేశంలోనే ఆ రికార్డు కొట్టి ఒక్కే ఒక్కడిగా నిలిచాడు.

‘కల్కి2898AD’ మూవీతో ప్రభాస్ అరుదైన రికార్డ్..!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు కల్కి. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్  దగ్గర ఈ సనిమా దుమ్ములేపుతోంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. తొలి రోజు తొలి షోకే పాజిటీవ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకలు ఎగబడుతున్నారు. దీంతో తొలి రోజే భారీగా కలెక్షన్లను కొల్లగొట్టింది. దాదాపు రూ.200 కోట్లకు పైనే సాధించినట్లు సమాచారం. ఇది ఇలాంటే ఈ సినిమా పలు రికార్డులను బ్రేక్ చేసే దిశగా వెళ్తోంది. ఈక్రమంలోనే కల్కి2898ఏడీ మూవీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అరుదైన రికార్డు సాధించాడు. అంతేకాక దేశంలోనే ఆ రికార్డు సాధించిన ఒక్కే ఒక్కడు ప్రభాస్. మరి.. ఆ రికార్డు ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కల్కి 2898 ఏడీ.. ఇండియన్ సినిమా నుంచి వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ కు అందిన ఐ ఫీస్ట్ ఈ సినిమా. ఎక్కడ చూసినా ఇప్పుడు కల్కి సినిమా గురించే చర్చ జరుగుతోంది. నాగ్ అశ్విన్ విజన్ కు అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. మైథాలజీని ఇలా సైంటిఫిక్ వేలో చూపించాలి అనే ఆ థాట్ కి ఫిదా అయిపోతున్నారు. హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ లేదు అన్నట్లు కల్కి మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. కలెక్షన్ల సునామి సృష్టింస్తోంది. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ.191 కోట్ల గ్రాస్ రాబట్టి ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ప్రభాస్, అమితాబ్, కమల్, దీపికాల నటన, అద్భుతమైన గ్రాఫిక్స్, ఆశ్చర్యపరిచే విజువల్ ఎఫెక్ట్స్, మహాభారతం సీన్స్ వెరసి సినిమాను ఓ లెవెలో నిలబెట్టాయి.

ఇక ఇలాంటి కథను ఎంచుకున్నందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ పై దేశవ్యాప్తంగా ఉన్న స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. కల్కిసినిమాతో యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. వరుసగా ఐదు సినిమాలు వందకోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించిన హీరోగా ప్రభాస్ నిలిచాడు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ చేసిన ప్రతీ మూవీ తొలి రోజే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. బాహుబలి-1 తరువాత బాహుబలి 2 రూ.217 కోట్లు సాధించింది.

అలానే సాహూ రూ.130 కోట్లు, ఆదిపురుష్ రూ.140 కోట్లు, సలార్ రూ.178 కోట్లు తొలి రోజే సాధించాయి. తాజాగా కల్కి2898 ఏడీ సినిమా కూడా రూ.191 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో వరుసగా ఐదు సినిమాలకు తొలి రోజే 100 కోట్లు దాటించిన తొలి హీరోగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశాడు.ఈ దీంతో ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అంటే ఒక్కే ఒక్కడు. అదే రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి