iDreamPost

మహేష్-రాజమౌళి మూవీ విషయంలో కీరవాణి కామెంట్స్.. ఫ్యాన్స్‌కిది నిజంగా బ్యాడ్ న్యూసే!

Keeravani About SSMB29: మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీపై కీరవాణి చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులని షాక్ కి గురి చేస్తున్నాయి.

Keeravani About SSMB29: మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీపై కీరవాణి చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులని షాక్ కి గురి చేస్తున్నాయి.

మహేష్-రాజమౌళి మూవీ విషయంలో కీరవాణి కామెంట్స్.. ఫ్యాన్స్‌కిది నిజంగా బ్యాడ్ న్యూసే!

ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన రాజమౌళి.. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ బాబు కూడా రాజమౌళితో సినిమా కోసం జిమ్ లో బాగా కష్టపడుతున్నారు. కఠిన వ్యాయామాలు చేస్తున్నారు. అయితే వీరి కాంబోలో మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. సినిమా స్టార్ట్ అయితే మూవీకి సంబంధించిన అప్డేట్స్ తో రిలీజ్ అయ్యే వరకూ గడిపేయవచ్చునని అనుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఇస్తారనుకుంటే చప్పుడు చేయలేదు. పోనీ మహేష్ బాబు పుట్టినరోజునాటికైనా సినిమా స్టార్ట్ అవుతుందనుకుంటే ఈసారి కూడా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసేలానే ఉన్నట్టు కనబడుతున్నారు.

మహేష్ బాబు పుట్టినరోజుకి మూవీ స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ చాలా ఆశపడ్డారు. అయితే వీరి ఆశల మీద నీళ్లు చల్లారు మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి. ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రతి సినిమాలకు ఈయన ఉండాల్సిందే. మహేష్-రాజమౌళి కాంబో కోసం కూడా ఈయనే పనిచేస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించి కీరవాణి చేసిన కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ కి షాకిస్తున్నాయి. తానింకా ఈ ప్రాజెక్ట్ పై పని స్టార్ట్ చేయలేదని.. ఇంకా కథ ఫైనల్ అవ్వలేదని అన్నారు. ఈ వారంలో కథ లాక్ అవుతుందని.. కొన్ని టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయని అన్నారు. తాను జూలై లేదా ఆగస్టు నెలలో పని మొదలుపెడతానని కీరవాణి అన్నారు.

కీరవాణి జూలై, ఆగస్టు నెలలో పని మొదలుపెడతా అన్నారంటే ఇక మహేష్ పుట్టినరోజుకి మూవీ షూటింగ్ మొదలుకాదన్నమాట. ఇంకా టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయంటే ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది ఆఖరులో గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. ఇక ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ మూవీ కోసం వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమా 2027లో విడుదలవుతుందని సమాచారం.     

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి