iDreamPost

హత్యలు.. రక్తపాతం.. OTTలో బెస్ట్ కొరియన్ కాప్ డ్రామా..

OTT Suggestions- Best Korean Drama Vigilante: కొరియన్ డ్రామాలు అంటే మీకు ఇష్టమా? అయితే మీకోసం ఒక క్రేజీ కొరియన్ డ్రామా సిరీస్ తీసుకొచ్చాం. లవ్ స్టోరీలు చూసి విసిగిపోయి ఉన్న వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

OTT Suggestions- Best Korean Drama Vigilante: కొరియన్ డ్రామాలు అంటే మీకు ఇష్టమా? అయితే మీకోసం ఒక క్రేజీ కొరియన్ డ్రామా సిరీస్ తీసుకొచ్చాం. లవ్ స్టోరీలు చూసి విసిగిపోయి ఉన్న వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

హత్యలు.. రక్తపాతం.. OTTలో బెస్ట్ కొరియన్ కాప్ డ్రామా..

కొరియన్ డ్రామా.. ఇండియాలో ఈ మూవీస్, వెబ్ సిరీస్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. నిజానికి సౌత్ ఇండియాలో.. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ K-డ్రామా చూస్తున్నారు. చూడటమే కాదండోయ్.. జాతి రత్నాల్లో నవీన్ పోలిశెట్టి రేంజ్ లో మాట్లాడేస్తున్నారు కూడా. అందుకు కారణం విపరీతంగా కొరియన్ డ్రామాలు చూడటమే. కొంతమంది సబ్ టైటిల్స్ కూడా లేకుండానే చూసేస్తున్నారు. ఇప్పుడు మీకోసం ఒక బెస్ట్ కొరియన్ కాప్ డ్రామా తీసుకొచ్చాం. ఈ మూవీలో లవ్, రొమ్యా*న్స్ ఏమీ ఉండవు. కానీ, ఒక మంచి కథ ఉంటుంది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్ ఉంటుంది. మంచి పోలీస్ డ్రామా ఉంటుంది.

మీకు కొరియన్ డ్రామాలు ఇష్టం ఉంటే మాత్రం మీకు ఈ వెబ్ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది. అయితే ఎప్పుడూ ఆ లవ్ డ్రామాలు కాకుండా ఫరే ఛేంజ్ ఈ సిరీస్ ట్రై చేయండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఇది ఒక మంచి పోలీస్ డ్రామా. ఒక సిటీలో హత్యలు జరుగుతూ ఉంటాయి. ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? అసలు వాళ్ల మోటో ఏంటి ఎవరికీ తెలియదు. ఆ హత్యలకు సంబంధించి విస్తృతంగా దర్యాప్తు చేస్తుంటారు. కానీ, ఎవరు ఆ హంతకుడు అనే విషయం మాత్రం తెలియదు. అయితే ఆ సిటీలో జరిగే అక్రమాలను ఎదిరించేందుకు ఒక వ్యక్తి అదృశ్యంగా పని చేస్తూ ఉంటాడు.

హీరో పోలీస్ అకాడమీలో స్టూడెంట్ గా ఉంటాడు. అయితే సిటీలో జరిగే క్రైమ్స్ ని ఆపేందుకు విజిల్యాంటీగా పని చేస్తూ ఉంటాడు. అంటే సిటీలో వాళ్లు చేసిన నేరాలకు చాలా తక్కువ శిక్ష పడితే వారిని ఇతను శిక్షిస్తూ ఉంటాడు. అలాగే నేరాలను అరికట్టేందుకు రాత్రులు సిటీలో తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ కుర్రాడిపై ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్ కి డౌట్ వస్తుంది. ఎలాగైనా ఆ కుర్రాడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ, అది అంత సులభం కాదు. చివరికి ఆ కుర్రాడు అనుకున్నది సాధించాడా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కుర్రాడిని పట్టుకున్నాడా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలి అంటే మీకు ఈ ‘విజిల్యాంటీ‘ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఇప్పటికే ఈ సిరీస్ చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ కొరియన్ డ్రామా చూసేందుకు క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి