iDreamPost

దక్షిణాదిలో అంతేనేమో.. ఆ స్టార్ హీరోయిన్ దారుణంగా అవమానించింది: హెయిర్ స్టైలిస్ట్

ఇప్పుడిప్పుడే దక్షిణాది ఇండస్ట్రీ వైపు బాలీవుడ్ చూపు పడుతుంది. టెక్నీషియన్లు, మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టులకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఓ మేకప్, హెయిర్ స్టైలిస్ట్ ఓ నటి తమను దారుణంగా అవమానించింది అంటూ తీవ్ర విమర్శలు చేసింది.

ఇప్పుడిప్పుడే దక్షిణాది ఇండస్ట్రీ వైపు బాలీవుడ్ చూపు పడుతుంది. టెక్నీషియన్లు, మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టులకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఓ మేకప్, హెయిర్ స్టైలిస్ట్ ఓ నటి తమను దారుణంగా అవమానించింది అంటూ తీవ్ర విమర్శలు చేసింది.

దక్షిణాదిలో అంతేనేమో.. ఆ స్టార్ హీరోయిన్ దారుణంగా అవమానించింది: హెయిర్ స్టైలిస్ట్

ఒక హీరోయిన్ తెరపై అందంగా కనిపించాలంటే మేకప్ ఆర్టిస్టులు కంపల్సరీ. సీన్ మారినప్పుడల్లా దుస్తులకు తగ్గట్లు మేకప్ అలాగే హెయిర్ స్టైల్ చేస్తుంటారు. అందుకే సెట్స్ లో మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్ట్‌లు నిత్యం వారికి అందుబాటులో ఉంటారు. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి పేకప్ చేప్పేదాక హీరోయిన్ వెంటే ఉంటారు. అయితే కొంత మంది హీరోయిన్స్.. వీరి పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. తగిన గౌరవం ఇవ్వరు. సాటి మనిషి అనే ఆలోచన కూడా చేయరు. వారి అవసరాలు మాత్రమే కాదు ఇబ్బందులు కూడా గుర్తించరు. దీంతో కొన్ని సార్లు ఈ ఆర్టిస్టులు చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ హెయిర్ స్టైలిస్ట్ హేమ ఓ స్టార్ నటిపై అనుచుత వ్యాఖ్యలు చేసింది. ఇంతకు ఆ నటి ఎవరంటే.. ఇటీవలే తల్లైన బ్యూటీ అమలాపాల్.

అమలాపాల్ తన పట్ల దురుసుగా ప్రవర్తించిందని బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ హేమ.. ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ఓ సారి షూటింగ్ నిమిత్తం అమలాపాల్‌తో కలిసి చెన్నైకు వెళ్లాను. ఓ ఫ్రెండ్ ద్వారా ఆమెను కలిశాను తప్ప.. నాకు ఆమె తెలియదు. ఏప్రిల్ లేదా మేలో మంచి ఎండల సమయంలో షూటింగ్ చేస్తున్నారు. చాలా వేడిగా ఉంది. నీడ కోసం చూడగా.. లొకేషన్‌లో ఒక్క చెట్టు కూడా లేకపోవడంతో వ్యానిటీ వ్యాన్ లోపలికి అడుగు పెట్టాం. ఆ వ్యాన్‌లో రెండు భాగాలుండేవి. ఓ వైపు ఆర్టిస్టులు కూర్చొవడానికి, మరోవైపు టెక్నీషియన్లకు కేటాయించారు. ఓ సారి అమలా తన మేనేజర్‌ను పిలిచి మమ్మల్ని వానిటీ వ్యాన్‌లో నుండి బయటకు వెళ్లిపోమని చెప్పింది. మేం ఏం అర్థంకాక ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం మొదలు పెట్టాం. ఇంత ఎండలో ఎక్కడి వెళ్లాలి.. అన్నట్లుగా ఉంది మా పరిస్థితి. కానీ దిగక తప్పలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

‘దక్షిణాది ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్టులు,హెయిర్ స్టైలిస్టులు వ్యానిటీలోకి రాకూడదని రూల్ ఏమన్నా ఉందో నాకు తెలియదు. కానీ అక్కడ మాకు అసలు విలువ ఇవ్వరు. అలాంటప్పుడు మేమెలా పరిచయం చేసుకుంటాం. టబు వంటి స్టార్స్‌తో కలిసి పనిచేశామని ఎలా చెప్పగలం? మాలాంటి వారి కోసం టబు వ్యాన్ అంతా బుక్ చేసేది. మమల్ని బాగా చూసుకునేది. కానీ దక్షిణాది ఇండస్ట్రీలో ఇలా ఉంటుందేమో’ అంటూ అమలా పాల్‌తో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఇక అమలాపాల్ సినిమాల విషయానికి వస్తే.. 2009లో మలయాళ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె మైనా సినిమాతో ఫేమస్ అయ్యింది. తెలుగులో బెజవాడ, లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరు అమ్మాయిలతో, జెండాపై కపిరాజు, పిట్టకథలు వంటి చిత్రాలు చేసింది. దర్శకుడు ఎఎల్ విజయ్ ను వివాహం చేసుకుని విడాకులిచ్చిన అమల.. గత ఏడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి