Nidhan
ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించి పొట్టి కప్పు ఫైనల్స్‌లోకి దర్జాగా అడుగుపెట్టింది టీమిండియా. బట్లర్ సేనను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. కప్పు కోసం తుదిపోరులో సౌతాఫ్రికాతో తాడోపేడో తేల్చుకోనుంది.
ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించి పొట్టి కప్పు ఫైనల్స్‌లోకి దర్జాగా అడుగుపెట్టింది టీమిండియా. బట్లర్ సేనను చిత్తు చేసిన మెన్ ఇన్ బ్లూ.. కప్పు కోసం తుదిపోరులో సౌతాఫ్రికాతో తాడోపేడో తేల్చుకోనుంది.
Nidhan
ఇంగ్లండ్‌పై ఘనవిజయం సాధించి పొట్టి కప్పు ఫైనల్స్‌లోకి దర్జాగా అడుగుపెట్టింది టీమిండియా. బట్లర్ సేనను చిత్తు చేసిన రోహిత్ సేన.. కప్పు కోసం తుదిపోరులో సౌతాఫ్రికాతో తాడోపేడో తేల్చుకోనుంది. ఇక, నిన్నటి మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని యూనిట్లు కలసికట్టుగా రాణించడంతో మనకు తిరుగులేకపోయింది. మ్యాచ్ మొత్తం ఫెంటాస్టిక్ గేమ్‌తో అలరించారు భారత ఆటగాళ్లు. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (47), హార్దిక్ పాండ్యా (23) సూపర్బ్ నాక్స్ ఆడారు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో 3 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లతో ప్రత్యర్థి వెన్ను విరిచాడు.
బౌలింగ్‌లో 3 వికెట్లు తీయడమే గాక ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి 10 పరుగులు చేసిన అక్షర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. క్రీజులో కుదురుకున్న జోస్ బట్లర్‌తో పాటు డేంజరస్ జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీని ఔట్ చేశాడు అక్షర్. ఈ మ్యాచ్ అనే కాదు.. గత మ్యాచుల్లోనూ అతడు అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఈ వరల్డ్ కప్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో చివర్లో వచ్చి మంచి కాంట్రిబ్యూషన్ అందిస్తున్నాడు అక్షర్. అయినా అతడికి అంతగా క్రెడిట్ దక్కడం లేదు. రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి స్టార్లకు దక్కినంత ప్రశంసలు అక్షర్‌కు దక్కడం లేదు. ఇదే విషయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా రియాక్ట్ అయ్యాడు. అక్షర్‌కు అన్యాయం చేస్తున్నారంటూ అతడు సీరియస్ అయ్యాడు.
‘అక్షర్ పటేల్ ఓ అద్భుతమైన ఆటగాడు. వరల్డ్ కప్‌లో అతడి బౌలింగ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ అతడు తన మార్క్ చూపిస్తున్నాడు. కానీ అతడికి అన్యాయం జరుగుతోంది. అతడికి దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కడం లేదు. పాకిస్థాన్‌తో లీగ్ మ్యాచ్‌లో రాణించినా అతడ్ని ఎవరూ పట్టించుకోలేదు. నిన్న ఇంగ్లండ్ మీద కూడా అతడు సూపర్బ్‌గా బౌలింగ్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయినా అక్షర్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఇది కరెక్ట్ కాదు’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్.. 11 పరుగులు మాత్రమే 1 వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లోనూ 20 పరుగులతో సత్తా చాటాడు. ఆ తర్వాతి మ్యాచుల్లోనూ రాణించిన అతడు.. ఇంగ్లండ్ మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయాడు. అతడు అదే విధంగా ఆడితే ఫైనల్లో భారత్‌కు తిరుగుండదు. మరి.. అక్షర్‌కు అంతగా క్రెడిట్ ఇవ్వట్లేదనే వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Akash Chopra ” Axar Patel is an incredible guy.I am crying and screaming from the Pakistan match that he is not getting the attention, importance and acknowledgment that he deserves.He is the Player of the Match but no one will talk about him tomorrow.”pic.twitter.com/654pYQpErs
— Sujeet Suman (@sujeetsuman1991) June 28, 2024