iDreamPost
android-app
ios-app

OTT Suggestions: శతమానం భవతిని మించిన ఫీల్ గుడ్ మూవీ ఇది.. ఏ OTTలో ఉందంటే?

  • Published Jun 28, 2024 | 6:48 PM Updated Updated Jun 28, 2024 | 6:48 PM

OTT Best Telugu Feel Good Movie : ఓటీటీ థ్రిల్లర్ మూవీస్ కోసమే కాకుండా అప్పుడప్పుడు ప్రేక్షకులు.. ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాస్ ను చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే..మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Telugu Feel Good Movie : ఓటీటీ థ్రిల్లర్ మూవీస్ కోసమే కాకుండా అప్పుడప్పుడు ప్రేక్షకులు.. ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాస్ ను చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే..మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 28, 2024 | 6:48 PMUpdated Jun 28, 2024 | 6:48 PM
OTT  Suggestions: శతమానం భవతిని మించిన ఫీల్ గుడ్ మూవీ ఇది.. ఏ OTTలో ఉందంటే?

కాసేపు టెన్షన్స్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఏదైనా సినిమాను చూడాలని అనుకుంటూ ఉంటారు.. కానీ సినిమాలలో కూడా గుండె దడ పెంచే హర్రర్ సినిమాలు , నెక్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తి పెంచే సస్పెన్స్ థ్రిల్లర్స్ , మర్డర్ మిస్టరీస్ వీటినే చూస్తూ ఇంకాస్త టెన్షన్ పడుతూ ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు కాస్త ఇలాంటి సినిమాలను పక్కన పెట్టేసి.. మనసుకు హాయి కలిగించే సినిమాలను కూడా చూస్తూ ఉండాలి. అలాంటి ఫీల్ గుడ్ సినిమాల కోసం సెర్చ్ చేసే వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. పైగా ఇదొక తెలుగు మూవీ. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో చెక్ చేసేయండి.

ఈ సినిమా పేరు “#కృష్ణా రామ” . ఈ సినిమాకు రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించగా.. రాజేంద్ర ప్రసాద్ , గౌతమి , అనన్య శర్మ , శ్రీకాంత్ అయ్యంగార్ , రచ్చ రవి , రవి వర్మ లాంటి వారు ముఖ్య పాత్రలలో నటించారు. పిల్లలకు దూరంగా ఉంటున్న తల్లిదండ్రుల భాధ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ శతమానం భవతి మూవీతో చూపించేశారు. ఈ సినిమా కూడా ఇంచుమించు అలాంటిదే. ఈ సినిమాలో కూడా పిల్లలకు దూరంగా ఉంటున్న తల్లిదండ్రుల బాధ.. ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. ఇప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీ గురించి తెలియకపోయినా.. నేర్చుకునే ఓపిక లేకపోయినా … పిల్లల కోసం ఏం చేయడానికైనా పేరెంట్స్ రెడీ అయిపోతారని.. ఈ సినిమాలో చూపించారు. కాబట్టి ఈ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాజేంద్ర ప్రసాద్ , గౌతమీ భార్య భర్తలు.. వీరిద్దరూ కలిసి అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. వీరు ఇద్దరూ కూడా టీచర్స్ గా చేసి రిటైర్మెంట్ తీసుకుంటారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉంటారు. వీరు ముగ్గురు కూడా విదేశాల్లో సెటిల్ అవుతారు. ఇక అందరికి ఉన్నట్లే వీళ్లకు కూడా పిల్లలకు దూరంగా ఉన్నామనే బాధ వేధిస్తూ ఉంటుంది. కేవలం నెలలో ఒకరోజు మాత్రం వారంతా వీడియో కాల్ లో.. ఈ జంటతో మాట్లాడుతూ ఉంటారు. కొన్నాళ్ల తర్వాత ఇక లాభం లేదని.. ఈ రిటైర్డ్ జంట కూడా సోషల్ మీడియా ద్వారా నిత్యం తమ పిల్లలకు దగ్గరకు ఉండాలని నిర్ణయించుకుని.. సోషల్ మీడియాలో ఒకటైన ఫేస్ బుక్ అకౌంట్ ను ఓపెన్ చేస్తారు. #కృష్ణారామ పేరుతో సోషల్ మీడియాలో ఈ జంట బాగా ఫేమస్ అవుతారు. అంతా బాగానే ఉన్న క్రమంలో వీరిద్దరూ ఒకరి నుంచి ఒకరు విడిపోయి.. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తారు. అసలు వారెందుకు ఆ నిర్ణయం తీసుకుంటారు! వారి పిల్లలు వారి దగ్గరకు వచ్చారా లేదా ! ఇవన్నీ తెలియాలంటే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయ్యే #కృష్ణారామ అనే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.