iDreamPost

మనిషి కనిపిస్తే చంపి తినేస్తారు.. OTTలో అదిరిపోయే థ్రిల్లర్!

OTT Suggestions- Best Crime Thriller Bones And All: ఓటీటీలో మీకోసం ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఈ మూవీ చూడాలంటే కాస్త గుండె ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే ఇందులో మనిషిని మనుషులే చంపి తినేస్తారు.

OTT Suggestions- Best Crime Thriller Bones And All: ఓటీటీలో మీకోసం ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ తీసుకొచ్చాం. ఈ మూవీ చూడాలంటే కాస్త గుండె ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే ఇందులో మనిషిని మనుషులే చంపి తినేస్తారు.

మనిషి కనిపిస్తే చంపి తినేస్తారు.. OTTలో అదిరిపోయే థ్రిల్లర్!

సాధారణంగా మీరు మనిషిని చంపుకుని తినే క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు చాలా తక్కువ చూసుంటారు. ఎందుకంటే అలాంటి సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. అయితే హాలీవుడ్ లో మాత్రం కొన్ని కొన్ని సినిమాలు, కొన్ని వెబ్ సిరీస్లలలో మాత్రం ఈ కాన్సెప్ట్ ఉంది. ముఖ్యంగా జాంబీ మూవీలు, వ్యాంపైర్ సినిమాల్లో ఈ తరహా పాయింట్ ఉంటుంది. కానీ, వాటికి భిన్నంగా ఒక కాన్సెప్ట్ తో మూవీ వచ్చింది. ఇందులో ఉండే క్యారెక్టర్స్ మ్యాన్ ఈటర్స్. అదే మనుషులను చంపుకుని తింటారు. సాధారణ మనిషిని చూస్తే వారిని వాళ్లు కంట్రోల్ చేసుకోలేరు. వాళ్లని చంపి తినే వరకు వారి మనసు, శరీరం కుదుట పడదు. అసలు ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

సాధారణంగా ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. వాటిలో కథ కూడా అంతేమీ ఉండదు. కేవలం టేకింగ్ మీద ఆధారపడి మూవీని ముందుకు తీసుకెళ్తారు. కానీ, ఈ మూవీ మాత్రం అలా కాదు. ఇందులో మంచి కథ ఉంది. మంచి ఎమోషన్ ఉంది. అన్నింటికి మించిన మంచి యాక్షన్ సీక్వెన్స్, డ్రామా ఉంది. ఈ సినిమాలో ఒక అమ్మాయి ఎంతో వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. తనకు ఆకలి వేస్తే ఒక ప్రాణం పోవాల్సిందే. ఆమె తనలో ఉన్న మృగాన్ని చాలాకాలం దాచి ఉంచింది. తనను పెంచిన తండ్రి కూడా ఆ విషయాన్ని దాచి ఉంచుతాడు. కానీ, ఒకరోజు ఆ విషయం వెల్లడి అవుతుంది. ఆ యువతి తన తోటి స్నేహితులను తినేస్తుంది.

ఆమె చేసిన పని బయటకు వచ్చేలోగా.. తండ్రి ఆమెను ఊరు దాటించేస్తాడు. అలా వేరే ఊరు వెళ్లిన ఆ యువతికి తనలాంటి ఇంకో వ్యక్తి పరిచయం అవుతాడు. ఆమె అప్పటి వరకు తాను ఒక్కతే అలాంటి సమస్యతో బాధ పడుతోంది అనుకుంటుంది. కానీ, మరో వ్యక్తి దొరకడంతో అతనితో స్నేహం చేస్తుంది. వీళ్లిద్దరికి ఒక వృద్ధుడు కనిపిస్తాడు. అతను మొదట మంచిగానే కనిపిస్తాడు. వారిలాంటి ఎంతో మందిని పరిచయం చేస్తాడు. అయితే అక్కడి నుంచే వీరి జీవితం కష్టాల్లో పడుతుంది. అందరూ వీరిని టార్గెట్ చేసుకుంటారు. ఆఖరికి వీళ్లని చంపాలి అని కూడా చూస్తారు.

అయితే వారిలాంటి వాళ్లే ఎందుకు చంపాలి అనుకున్నారు. అసలు వారికి ఉన్న సమస్య ఏంటి? అంత మందిని చంపేసి దొరక్కుండా ఎలా తిరుగుతున్నారు? ఇలాంటి చాలానే ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే సినిమా మాత్రం అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అలాగే మంచి సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఈ సినిమా పేరు ‘బోన్స్ అండ్ ఆల్‘. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. రూ.119కు మీరు ఈ మూవీని చూడచ్చు. అలాగే యాపిల్ టీవీ+లో రూ.150కు ఈ మూవీ అందుబాటులో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి