iDreamPost

OTT Movie Suggestion: విక్రమ్ ఐ మూవీ లాంటి మరో విచిత్ర లవ్ స్టోరీ.. OTT లో ఉంది చూశారా !

  • Published Jun 28, 2024 | 6:41 PMUpdated Jun 28, 2024 | 6:41 PM

టాలీవుడ్ , బాలీవుడ్ , హాలీవుడ్ లో ఇప్పటివరకు ఎన్నో ప్రేమ కథలు వచ్చాయి. లవ్ ట్రాక్ లో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం చాలా డిఫ్ఫరెంట్.. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

టాలీవుడ్ , బాలీవుడ్ , హాలీవుడ్ లో ఇప్పటివరకు ఎన్నో ప్రేమ కథలు వచ్చాయి. లవ్ ట్రాక్ లో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం చాలా డిఫ్ఫరెంట్.. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 28, 2024 | 6:41 PMUpdated Jun 28, 2024 | 6:41 PM
OTT Movie Suggestion: విక్రమ్ ఐ మూవీ లాంటి మరో  విచిత్ర లవ్ స్టోరీ.. OTT లో ఉంది చూశారా !

ప్రేమ కథా చిత్రాలు ఏ భాషలో వచ్చినా కానీ.. ప్రేక్షకులు వాటిని బాగానే ఆదరిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలో గతంలో తెలుగులో ఓ అందమైన అమ్మాయికి, వింత రూపంలో ఉన్న అబ్బాయికి మధ్య ప్రేమ కథ వచ్చింది. అదే అమీ జాక్సన్ , విక్రమ్ నటించిన ఐ మూవీ. ఈ సినిమా ప్రతి ఒక్కరిని మెప్పించింది. అచ్చం అలాంటి కాన్సెప్ట్ తోనే ఓటీటీ లో మరో సినిమా ఉంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ అదే. ఇది బాలీవుడ్ సినిమా అయినా కానీ తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఎంచక్కా చూసేయండి, దాదాపు ఈ సినిమాను అందరూ చూసి ఉంటారు. ఇంకా ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా కథేంటంటే.. ఫ్రాన్స్ లో ఓ అందమైన రాజు ఉంటూ ఉండే వాడు.. అతనికి రాజ్యాన్ని కోటని అందంగా ఉంచుకోవడం అలవాటు. కోట కోసం అందమైన వస్తువులు కొంటూ ఉండే వాడు.. వాటికోసం ప్రజల దగ్గర ఎక్కువ పన్ను వసూళ్లు చేసి.. రాత్రుళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టించేవాడు. అసలు ప్రేమ, దయ అంటే ఏంటో కూడా అతనికి తెలియదు. ఓ రోజు బయట పెద్ద తుఫాను రావడంతో.. ఓ ముసలావిడ ఆ కోటలోకి వచ్చి.. తుఫాను తగ్గేవరకూ అక్కడ ఉంటాను అని.. రాజుకి ఓ రోజా పువ్వు ఇచ్చి అడుగుతుంది. కానీ రాజు ఆ గులాబీ పువ్వును నిలిపివేసి.. ఆ ముసలావిడ రూపాన్ని చూసి ఆమెను అసహ్యించుకుంటాడు. రాజుతో పాటు అక్కడున్న వారంతా కూడా అలానే ఆమెను హేళన చేయడంతో.. ఆమె తన రూపాన్ని మార్చేస్తుంది. నిజానికి ఆమె రాజు దయ హృదయాన్ని పరీక్షించడానికి వచ్చిన దేవత. రాజు ఏంటో అర్ధమైన తర్వాత ఆమె తన అసలు రూపంలోకి మారిపోయి.. ఆ రాజును ఓ బీస్ట్ లా మార్చేసి ఓ శాపాన్ని పెడుతుంది.

తాను తెచ్చిన గులాబీ పూరేకులు రాలిపోయే లోపు ఆ రాజుని ఎవరైనా ప్రేమిస్తేనే.. మళ్ళీ తిరిగి మానవ రూపంలోకి వచ్చే అవకాశం ఉందని.. లేదంటే రాజుతో పాటు అక్కడున్న వారంతా కూడా చనిపోతారని శాపం పెట్టి.. అక్కడినుంచి మాయమైపోతుంది. అక్కడున్న వారందరిని కూడా ఆమె వస్తువుల మార్చేస్తుంది. దీనితో ఆ రాజ్యం అంతా కూడా అందవిహీనంగా మారిపోతుంది. అసలే బీస్ట్ రూపంలో ఉన్న రాజుని ఎవరు ప్రేమిస్తారు ! ఆ తర్వాత ఏం జరిగింది ! రాజును ప్రేమించడానికి ఎవరైనా అమ్మాయి దొరికిందా లేదా ! ఆ గులాబీ రేకులు ఎంత కాలం రాలకుండా ఉంటాయి ! అసలు ఈ కథ ఎలా ముందుకు సాగింది ! ఇవన్నీ తెలియాలంటే “బ్యూటీ అండ్ ది బీస్ట్” అనే ఈ హాలీవుడ్ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రస్తుతం ఎమ్ ఎక్స్ ప్లేయర్ ఓటీటీ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం.. వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై ఎం అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి