iDreamPost

OTT Movie : డైరెక్ట్ గా OTT లోకి సుమంత్ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Jun 28, 2024 | 6:33 PMUpdated Jun 28, 2024 | 6:33 PM

ఓటీటీ లకు ఆదరణ బాగా పెరుగుతున్న విషయం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ఓటీటీ లకు ఆదరణ బాగా పెరుగుతున్న విషయం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Jun 28, 2024 | 6:33 PMUpdated Jun 28, 2024 | 6:33 PM
OTT Movie : డైరెక్ట్ గా OTT లోకి సుమంత్ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

అసలే ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ఇక ప్రేక్షకుల ఎదురుచూపులకు తగినట్లుగానే మేకర్స్ కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలను ఓటీటీ లలోకి తీసుకుని వస్తున్నారు. ఈ వారం ఓటీటీ లోకి రానున్న సినిమాలు ఇవే అంటూ .. ఈ వారం ఈ సినిమాలను అసలు మిస్ కాకండి అంటూ.. ఇలా ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు రావడమే కాకుండా.. ఈ సినిమాలను అసలు మిస్ కాకండి అంటూ కూడా చాలా సినిమా సజ్జెషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు ఇప్పుడు ఓటీటీ లకు ఎంత ఆదరణ పెరిగిపోయింది అనే విషయం. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ లోకి మరొక కొత్త సినిమా రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు వెండి తెరమీద అలరించిన ఎంతో మంది హీరోలు , హీరోయిన్లు ఓటీటీ లకు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరో సుమంత్ కూడా ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకు సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పేరు ” అహం రీబూట్” . మూవీ పేరు వినడానికి ఎంత డిఫ్ఫరెంట్ గా ఉందో.. సినిమా కాన్సెప్ట్ కూడా అంతే డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో పూర్తి చేసుకున్నారు కానీ రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. ఇక కారణలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. థియేటర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్న ఈ సినిమాను.. ఇప్పుడు నేరుగా ఓటీటీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాను జూన్ 30 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. మరి ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. ఇదొక సైకోలాజికల్ థ్రిల్లర్ మూవీ.. ఈ జోనర్ సినిమాలన్నీ కూడా ఒకటే జోనర్ లో ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. స్టూడియోలో ఉన్న సుమంత్ కు ఓ అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. తానూ ఓ ఆపదలో ఉన్నానంటూ.. చెప్తుంది. ఆ అమ్మాయి ఎవరు ? ఆమెను ఎవరైనా కిడ్నప్ చేశారా ! లేక ఆమె మరేదైనా సమస్యలో ఉందా! ఈ విషయంలో సుమంత్ ఏం చేశాడు ! అనేదే ఈ సినిమా స్టోరీ లైన్ . కొన్ని అనుకోని సంఘటనల వలన మనిషిలోని కొత్త కోణాలు ఎలా బయటపడతాయి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. మరి ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి మార్కులు కొట్టేస్తుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి