iDreamPost

నాన్న మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే?

  • Published Jun 28, 2024 | 6:03 PMUpdated Jun 28, 2024 | 6:03 PM

Pic Talk: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నాన్న సినిమాల్లో అలరించిన ఈ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే హీరోయిన్లకు మించిన అందంతో క్యూట్ గా మారిపోయింది. ఇంతకి ఇప్పుడు ఈ చిన్నారి ఎప్పుడు ఎలా ఉందంటే..?

Pic Talk: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నాన్న సినిమాల్లో అలరించిన ఈ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే హీరోయిన్లకు మించిన అందంతో క్యూట్ గా మారిపోయింది. ఇంతకి ఇప్పుడు ఈ చిన్నారి ఎప్పుడు ఎలా ఉందంటే..?

  • Published Jun 28, 2024 | 6:03 PMUpdated Jun 28, 2024 | 6:03 PM
నాన్న మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే?

ప్రస్తుతం ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుల హవానే జోరుగా కొనసాగుతుంది. ఎందుకంటే.. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో స్టార్స్ గా కొనసాగుతున్న వారిలో ఎక్కువ శాతం చైల్డ్ ఆర్టిస్టులుగా వెండితెరపై అడుగుపెట్టినవారే ఉండటం గమన్హారం. అయితే బాలనటులుగా అలరించిన యాక్టర్స్ ముందుగా ఆగ్రహీరోలా సినిమాల్లో నటించేవారే ఎక్కువ. అలా చిన్నతనం నుంచే యాక్టర్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత.. చదువుపై ఫోకస్ పెడుతున్నారు. ఇక మరి కొంతమంది అయితే మళ్లీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే చైల్డ్ ఆర్టిస్టులు హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. కానీ, అలా ఇచ్చిన వారిలో సక్సెస్ అయ్యి కొనసాగినవారు తక్కువగా ఉంటారు. ఇకపోతే చిన్నప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అలరించిన వారు ఒక్కసారిగాగా తెరపై ఎంట్రీ ఇస్తే.. గుర్తుపట్టాడం చాల కష్టం.అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఒకరు. అవును.. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నాన్న సినిమాల్లో అలరించిన ఈ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే హీరోయిన్లకు మించిన అందంతో క్యూట్ గా మారిపోయింది. ఇంతకి ఇప్పుడు ఈ చిన్నారి ఎప్పుడు ఎలా ఉందంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో నాన్న మూవీ కూడా ఒకటి. ఇక ఈ సినిమాలో విక్రమ్ కు కూతురిగా ‘సారా అర్జున్’ అనే చిన్నారి నటించింది. అయితే ఈ సినిమాలో విక్రమ్ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో.. అందులో నటించిన ఆ చిన్నారికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అలాగే ఆ సినిమాలో సారా ఎంతో క్యూట్ అలరించి ప్రేక్షకుల మనసును దోచేసింది. ఇక ఈ సినిమా తర్వాత చాలా ఏళ్లకు ఈ అమ్మాయి పలు హిందీ సినిమాల్లో అలరించింది. అంతేకాకుండా.. ఇటీవలే మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమయ్యింది సారా. ఇక ఈ సినిమాలో సారా చాలా అందంగా, క్యూట్ గా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చే విధంగా కనిపించింది. అలాగే సినిమాలో ఈ టీనేజ్ కు వచ్చిన సారాను చూసి ప్రేక్షకులు మంత్ర ముగ్దులయ్యారు. పైగా పొన్నియన్ సెల్వన్ సినిమాలో సారా నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోస్ చూసిన సారా అభిమానులు చిన్నప్పుడే కాకుండా టీనేజ్ లో కూడా సారా అందం మరింత రెట్టింపు అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు.

Nanna movie child artist present life

ఇదిలా ఉంటే.. పొన్నియన్ సెల్వన్ సినిమాతో చాలా గ్యాప్ తీసుకున్న సారా.. ఇప్పుడు తమిళ్ లో కొటేషన్ గ్యాంగ్ అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ప్రియమణి, సన్నీలియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో సారా డ్రగ్స్ కు బానిసైన యువతిగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన పోస్టర్ కూడా తాజాగా విడుదలైంది. ఇక ఈ పోస్టర్ ను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఎంతో అందంగా ఉన్న సారాను ఇలా భయంకరంగా తయారు చేశారేంటి అని తెగ ఫీల్ అయిపోతున్నారు.మరి, ప్రస్తుతం సారా లేటెస్ట్ మూవీ పోస్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి