iDreamPost

జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిన నాగ్ అశ్విన్.. ఆ స్టార్ హీరోతోనే నెక్స్ట్ మూవీ!

Nag Ashwin: నాగ్  అశ్విన్ .. తొలుత మహానటి సినిమాతో టాలీవుడ్ లో ప్రత్యేకంగా కనిపించారు. ప్రస్తుతం కల్కి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. తాజాగా నాగి మరో లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.

Nag Ashwin: నాగ్  అశ్విన్ .. తొలుత మహానటి సినిమాతో టాలీవుడ్ లో ప్రత్యేకంగా కనిపించారు. ప్రస్తుతం కల్కి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. తాజాగా నాగి మరో లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.

జాక్ పాట్  ఛాన్స్ కొట్టేసిన నాగ్ అశ్విన్..  ఆ స్టార్ హీరోతోనే నెక్స్ట్ మూవీ!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు ‘కల్కి’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరెకక్కిన ఈ మైథలాజికల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తొలి రోజు నుంచే బాక్సాఫీస్ పై వసూళ్ల దండయాత్ర చేసింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించింది. హాలీవుడ్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఈ సినిమాను నాగీ తెరకెక్కించాడు. దీంతో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నాగ్ అశ్వీన్ పేరు మారుమోగిపోతుంది. ఇక కల్కి2898 ఏడీ ఇచ్చిన సూపర్ హాట్ తో నాగ్ అశ్విన్ కి లక్కి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. తన తదుపరి సినిమా ఓ  టాలీవుడ్ స్టార్ హీరోతో చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి.. ఆ హీరో ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

నాగ్  అశ్విన్ .. తొలుత మహానటి సినిమాతో టాలీవుడ్ లో ప్రత్యేకంగా కనిపించారు. ప్రస్తుతం కల్కి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు కూడా నాగ్ అశ్వీన్ అంటే ఒక డైరెక్టర్ అని మాత్రమే చాలా మందికి తెలుసు. అలానే ఆయన తెరకెక్కించే సినిమాలు బాగుంటాయి, ఫ్యామిలీ అంత కలిసి చూడొచ్చు, అలానే ఫుల్ గా ఎంటర్ టైన్ కావొచ్చు అనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది.

కానీ ఒకే ఒక్క సినిమా నాగ్ అశ్విన్ క్రేజ్ తో పాటు సినిమా చరిత్రనే తిరగారాసింది. కల్కి2898 ఏడీ సినిమాతో నాగ్ అశ్వీన్ ప్రభంజనం సృష్టించాడు. మహాభారతంని బేస్ చేసుకుని కలియుగంతానికి ముడి పెడుతూ ప్రస్తుతం సాంకేతికతను ఉపయోగించి ఆడియన్స్ కి అర్థమయ్యే రీతిలో కల్కి2898ఏడీ చిత్రాన్ని తెరకెక్కించాడు. హాలీవుడ్ సినిమాలను తలపిస్తూ ఈ సినిమాను నాగ్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా చూసిన వారందరు నాగ్ డైరెక్షన్ కి దా అవ్వడమే కాకుండా ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు.

‘కల్కి2898ఏడీ’ తొలి రోజే దాదాపు రూ.190 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా నాగ్ అశ్వీన్ పేరు మారుమ్రోగిపోతుంది . ఇక కల్కి సినిమా ఇచ్చిన హిట్ కిక్కుతో నాగ్ అశ్విన్ ..తన తరువాతి సినిమా ఏ హీరోతో సినిమాను తెరకెక్కించబోతున్నాడు అనే విషయం అందరిలో ఆసక్తిగా మారింది. కల్కి 2 సినిమా కూడా త్వరలోనే రాబోతుందని టాక్. అలానే ఈ కల్కి-2 సినిమా పూర్తి కాకముందే ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో జాక్ పాట్ ఛాన్స్ అందుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నాగ్ అశ్వీన్ సినిమా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. రాంచరణ్ కల్కి2898 ఏడీ సినిమా చూసి..రామ్ చరణ్ ఇంప్రెస్ అయ్యారంట. అంతేకాక స్వయంగా నాగ్ అశ్వీన్ ఫోన్ చేసి.. విష్ చెప్పారంట. అంతేకాదు వీళ్ళ మాటల సందర్భంలో ఒక ప్రాజెక్టు కూడా కన్ఫర్మ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. నెటింట్లో ఇప్పుడు ఇదే వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. మరి.. ఈ న్యూస్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి