iDreamPost

ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నారా? ఇతనిలా లక్షలు పోగొట్టుకుంటారు జాగ్రత్త!

Man Loss 21 Lakh By Insta Reels: ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నారా? అయితే జాగ్రత్త.. రీల్స్ చూసే సమయంలో ఈ పొరపాటు చేస్తే మీరు లక్షలు కోల్పోయే అవకాశం ఉంది. హైదరాబాద్ కి చెందిన ఓ వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ చేసిన ఒక పొరపాటుతో ఏకంగా 21 లక్షలు కోల్పోయారు. మీరు ఈ తప్పు చేస్తే మీకు చాలా నష్టం కలుగుతుంది జాగ్రత్త.

Man Loss 21 Lakh By Insta Reels: ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నారా? అయితే జాగ్రత్త.. రీల్స్ చూసే సమయంలో ఈ పొరపాటు చేస్తే మీరు లక్షలు కోల్పోయే అవకాశం ఉంది. హైదరాబాద్ కి చెందిన ఓ వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ చేసిన ఒక పొరపాటుతో ఏకంగా 21 లక్షలు కోల్పోయారు. మీరు ఈ తప్పు చేస్తే మీకు చాలా నష్టం కలుగుతుంది జాగ్రత్త.

ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నారా? ఇతనిలా లక్షలు పోగొట్టుకుంటారు జాగ్రత్త!

ఇన్ స్టా రీల్స్ చూస్తున్నారా? రీల్స్ మాత్రమే చూస్తున్నారా? ఇంకా ఏమైనా చూస్తున్నారా? రీల్స్ మాత్రమే చూసి వదిలేస్తే పర్లేదు. కానీ ఈ పొరపాటు చేస్తే మాత్రం లక్షలు నష్టపోతారు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా యాప్స్ లో పలు రకాల యాడ్స్ వస్తుంటాయి. అయితే మీరు ఇలాంటి యాడ్స్ చూస్తే కనుక లక్షల్లో నష్టపోతారు. యాడ్స్ ఏ కదా ఏం చేస్తాయ్ అని అనుకోకండి. ఆ ప్రకటనలే ఓ ఐటీ ఉద్యోగి కొంప ముంచాయి. ఏకంగా 21 లక్షలు పోగొట్టుకునేలా చేశాయి. చెమట చుక్క చిందించకుండా.. నీతి, నిజాయితీ లేకుండా ఈజీగా డబ్బు సంపాదించాలంటే ఒకటే మార్గం మందిని మోసం చేయడం. ఈ మధ్య కాలంలో ఇలాంటి వాళ్ళు మరీ ఎక్కువైపోయారు.

మనుషుల్ని మోసం చేయడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని అడ్డదారుల్లోనూ మోసం చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ పేరుతో కూడా ఇప్పుడు మోసాలు ఎక్కువైపోయాయి. ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక వ్యసనం లాంటిది. అప్పు చేసి మరీ తెచ్చి పెట్టేంతగా ఇది మనిషిని ప్రభావితం చేస్తుంది. నాలెడ్జ్ లేకుండా 100 ఇన్వెస్ట్ చేస్తే 200 వచ్చాయని లక్ష పెడితే నిమిషంలో మొత్తం పోతాయి. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలని అనుకునేవారిని టార్గెట్ చేస్తూ కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కూకట్ పల్లి జేఎన్టీయూ దగ్గర వసంత్ నగర్ లో ఉండే నరేష్ ని ఓ గ్యాంగ్ మోసం చేసింది. నరేష్ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. అయితే ఇన్స్టాగ్రామ్ లో స్టాక్ మార్కెట్ పెట్టుబడికి సంబంధించి ఒక ప్రకటనను చూశారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సిటీకి చెందిన ‘ఎసెన్స్ ఇన్వెస్ట్మెంట్’ అనే కంపెనీకి చెందిన ప్రకటన చూసి వారిని సంప్రదించారు. వారు తమ వద్ద ఇన్వెస్ట్ చేస్తే తక్కువ కమిషన్ తీసుకుని ఎక్కువ లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించారు. కంపెనీ వెబ్ సైట్ లో అడ్రస్, మెయిల్ ఐడీ, సెబీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండడం చూసి నమ్మకం కుదుర్చుకున్నారు నరేష్. ఆ కంపెనీ ఉద్యోగుల సూచనలతో విడతల వారిగా మొత్తం 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. కొంత లాభం రావడంతో డబ్బులు విత్ డ్రా చేసే ప్రయత్నం చేశారు నరేష్. కానీ అప్పుడే తీయద్దు.. మరిన్ని లాభాలు వస్తాయని ఆశ చూపడంతో నరేష్ వాళ్ళ ఒత్తిడి మేరకు లోన్ తీసుకుని మరీ మరో 8 లక్షలు తెచ్చి పెట్టుబడి పెట్టారు. వాళ్ళు చెప్పినట్టే 18 లక్షల పెట్టుబడి 28 లక్షలు అయ్యింది.

లాభాలు రావడంతో డబ్బులు తీసేసుకోవాలని ఫిక్స్ అయ్యారు నరేష్. ఆ విషయం ఆ కంపెనీ వాళ్ళకి చెప్పగా.. వారు 3 లక్షలు పన్ను చెల్లించాలని చెప్పారు. అది నమ్మిన నరేష్ నెట్ బ్యాంకింగ్ ద్వారా వారికి 3 లక్షలు చెల్లించారు. ఇంకేముంది వాళ్ళు ఫోన్ స్విచ్చాఫ్ చేసి పెట్టుకున్నారు. వాట్సాప్ లో సంప్రదించినా రెస్పాన్స్ లేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన నరేష్.. ఆన్ లైన్ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ఒక స్టాక్ మార్కెట్ ప్రకటన చూసి నరేష్ రూ. 21 లక్షలు కోల్పోయారు. ఇన్ స్టాలో రీల్స్ చూడ్డానికి వెళ్లి యాడ్స్ చూసి టెంప్ట్ అయ్యి నిండా మునిగిపోయారు. ఒక ఇన్ స్టా యాడ్ అతని కొంప ముంచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి