nagidream
Key Changes From July Month: జూలై నెలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. బ్యాంకులు, క్రెడిట్ కార్డులు, జియో రీఛార్జ్ ప్లాన్ ధరల పెంపుతో సహా పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. జూలై నెలలో కొందరి మీద భారం పడుతుండగా.. మరి కొందరికి మాత్రం కాస్త ఉపశమనం లభిస్తుంది.
Key Changes From July Month: జూలై నెలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. బ్యాంకులు, క్రెడిట్ కార్డులు, జియో రీఛార్జ్ ప్లాన్ ధరల పెంపుతో సహా పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. జూలై నెలలో కొందరి మీద భారం పడుతుండగా.. మరి కొందరికి మాత్రం కాస్త ఉపశమనం లభిస్తుంది.
nagidream
జూలై నెలలో ఫైనాన్షియల్, బ్యాంకింగ్ సహా పలు రంగాలకు సంబంధించి కొత్త నిబంధనలు రాబోతున్నాయి. కొన్నిటికి సంబంధించి గడువు తేదీలు కూడా ముగియనున్నాయి. ఈ కొత్త రూల్స్ తో సామాన్యుల జీవితాల్లో కీలక ప్రభావం పడనుంది. కాబట్టి ఈ మార్పుల గురించి తెలుసుకోవడం ఎంతైనా మంచిది.
ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తమ క్రెడిట్ కార్డుల విషయంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు రీప్లేస్ మెంట్ ఫీజుని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది జూలై 1 నుంచి అమలు కానుంది. ప్రస్తుతం ఈ ఫీజు వంద రూపాయలు ఉండగా జూలై 1 నుంచి 200 కాబోతుంది. అలానే చెక్, క్యాష్ పికప్ కింద వసూలు చేసే వంద రూపాయల ఫీజును, అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, స్లిప్ రిక్వెస్ట్ ఛార్జీ, డూప్లికేట్ స్టేట్మెంట్ రిక్వెస్ట్ ఛార్జీలను ఐసీఐసీఐ బ్యాంక్ నిలిపివేయనుంది.
ఎస్బీఐ ఎంపిక చేసిన కొన్ని క్రెడిట్ కార్డులకు సంబంధించి రివార్డు పాయింట్ల విషయంలో బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంబంధిత లావాదేవీలు జరిపితే వాటి మీద రివార్డ్ పాయింట్లు వర్తించవు. ఈ రూల్ జూలై 15 నుంచి వర్తిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. రూపే ప్లాటినం డెబిట్ కార్డు లాంజ్ యాక్సెస్ ప్రోగ్రాంలో మార్పులు తీసుకొచ్చింది. ఈ కార్డుపై ప్రతి త్రైమాసికానికి ఒక డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లేదా రైల్వే లాంజ్ యాక్సెస్, ఏడాదికి రెండు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ లు లభించనున్నాయి. ఈ మార్పులు జూలై 1 నుంచి రానున్నాయి.
జూలై 15తో సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డుల మైగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఈ ప్రక్రియ తర్వాత ప్రస్తుత సిటీ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులకు కొత్త యాక్సిస్ బ్యాంక్ ప్రయోజనాలు అందుతాయని తెలిపింది. మైగ్రేషన్ తర్వాత కస్టమర్లు కొత్త యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను కొన్ని నెలల్లోనే పొందుతారని.. అయితే అవి వచ్చే వరకూ సిటీ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు పని చేస్తాయని యాక్సిస్ బ్యాంకు తెలిపింది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆఖరు తేదీ జూలై 31. కాబట్టి ఈ తేదీని సేవ్ చేసి పెట్టుకోండి. ఈ తేదీకి ముందుగానే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోండి.
ఏడాది, అంతకంటే ఎక్కువ కాలం ఎలాంటి లావాదేవీలు జరపనటువంటి వాలెట్లను, బ్యాలెన్స్ లేకుండా ఇనాక్టివ్ గా ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను జూలై 20 నుంచి క్లోజ్ చేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది.
జియో టారిఫ్ ప్లాన్స్ పై ధరలను భారీగా పెంచేసింది. ఏకంగా 30, 40, 50, 100 ఇలా పెంచుకుంటూ పోయింది. నెలవారీ, రెండు నెలలు, మూడు నెలలు, ఏడాది, డేటా యాడ్ ఆన్, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ పై ప్రస్తుతం ఉన్న ధరలను సవరించి కొత్త ధరలను అప్డేట్ చేసింది. ఈ కొత్త ధరలు జూలై 3 నుంచి అమలులోకి రానున్నాయి.