iDreamPost
android-app
ios-app

Virat Kohli: నాకౌట్​లో చేతులెత్తేసిన కోహ్లీ.. అతడి ఫెయిల్యూర్​కు రీజన్ ఇదే!

  • Published Jun 27, 2024 | 10:11 PM Updated Updated Jun 27, 2024 | 10:11 PM

భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోమారు నిరాశపర్చాడు. కీలకమైన నాకౌట్ ఫైట్​లో అతడు చేతులెత్తేశాడు. కోహ్లీ ఫెయిల్యూర్​కు రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోమారు నిరాశపర్చాడు. కీలకమైన నాకౌట్ ఫైట్​లో అతడు చేతులెత్తేశాడు. కోహ్లీ ఫెయిల్యూర్​కు రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 27, 2024 | 10:11 PMUpdated Jun 27, 2024 | 10:11 PM
Virat Kohli: నాకౌట్​లో చేతులెత్తేసిన కోహ్లీ.. అతడి ఫెయిల్యూర్​కు రీజన్ ఇదే!

భారత్-ఇంగ్లండ్ మధ్య నాకౌట్ ఫైట్ మొదలైంది. టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్​కు దిగింది. అయితే జట్టుకు మంచి స్టార్ట్ లభించలేదు. విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ కలసి తొలి వికెట్​కు 19 పరుగులు మాత్రమే జోడించారు. 9 పరుగులు చేశాక కోహ్లీ ఔట్ అయ్యాడు. రీస్ టోప్లే బౌలింగ్​లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రూమ్ తీసుకొని బాల్​ను గట్టిగా బాదాలని ప్రయత్నించాడు కోహ్లీ. కానీ అతడి బ్యాట్​ను దాటిన బంతి వెళ్లి వికెట్లను గిరాటేసింది. సెమీస్​లో చెలరేగి ఆడతాడని అనుకుంటే.. కోహ్లీ మళ్లీ చేతులెత్తేశాడు. అతడి ఫెయిల్యూర్​కు పలు కారణాలు కనిపిస్తున్నాయి. అతడు ఔట్ అయిన షాట్​ను గమనిస్తే.. ఆ సమయంలో కోహ్లీ బాడీ షేప్​లో లేదు.

భారీ షాట్ ఆడాలని ముందే ఫిక్స్ అయిన కోహ్లీ ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయాడు. అలాగే బాల్ లైన్ కూడా మిస్సయ్యాడు. ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న గయానా వికెట్ చాలా కఠినంగా ఉంది. బంతి అస్సలు బౌన్స్ అవడం లేదు. పిచ్​పై పడ్డాక బంతి అనూహ్యంగా లో అవుతోంది. దీంతో షాట్ మేకింగ్ కష్టంగా మారింది. ఇక్కడ పరుగులు చేసేందుకు బ్యాటర్లు ఆపసోపాలు పడుతున్నారు. క్రీజులో సెటిలైతే పరుగులు వచ్చే అవకాశం ఉంది. కానీ కోహ్లీ మాత్రం దూకుడు మంత్రాన్ని జపించి వికెట్ పారేసుకున్నాడు. చెత్త షాట్ సెలెక్షన్​తో క్రీజును వీడాడు. అతడి అనవసర దూకుడు టీమ్ కొంప ముంచింది. బౌన్స్ లేని కఠిన వికెట్ మీద నిలదొక్కుకోవడం కోసం కాకుండా కోహ్లీ అగ్రెసివ్​గా వెళ్లాలని డిసైడ్ అవ్వడం భారత్​కు శాపంగా మారింది. టైమింగ్​తో షాట్లు కొట్టే కోహ్లీ అలా కాకుండా బంతిని బలంగా బాదాలని చూడటం ఇంగ్లండ్​కు వరమైంది. మరి.. కోహ్లీ ఫెయిల్యూర్​కు ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.