iDreamPost
android-app
ios-app

అఫీషియల్: సూర్య కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది..

  • Published Jun 27, 2024 | 9:13 PM Updated Updated Jun 27, 2024 | 9:13 PM

Hero Suriya Kanguva Release Date: హీరో సూర్య- డైరెక్టర్ శివ కాంబోలో వస్తున్న కంగువ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించేశారు.

Hero Suriya Kanguva Release Date: హీరో సూర్య- డైరెక్టర్ శివ కాంబోలో వస్తున్న కంగువ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించేశారు.

  • Published Jun 27, 2024 | 9:13 PMUpdated Jun 27, 2024 | 9:13 PM
అఫీషియల్: సూర్య కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది..

సౌత్ లోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఇప్పుడు హీరో సూర్యాకు స్టార్డమ్, మార్కెట్ క్రియేట్ అయ్యాయి. సూర్యా చేశాడు అంటే కచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అనే ట్యాగ్ అయితే సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా.. విభిన్నమైన, వైవిధ్యమైన కథలతో సూర్యా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. అందుకు తగినట్లుగానే ఈ కంగువ కథను కూడా ఎంచుకున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే చాలానే అప్ డేట్స్ వచ్చాయి. వాటిని చూస్తే.. ఈ మూవీ కచ్చితంగా ఇండియన్ సినిమాలో ఒక మైలురాయి అవుతుంది అని అర్థమవుతోంది. అలాంటి మూవీ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ డేట్ రానే వచ్చింది.

హీరో సూర్య నటిస్తున్న కంగువ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో చాలానే అంచనాలు ఉన్నాయి. ఈసారి బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ పాయింట్ అలా ఉంది. అంతేకాకుండా.. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే. సూర్యాకి ధీటుగా నటించాలంటే అలాంటి ఒక ప్రతినాయకుడు కావాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా ఈ మూవీని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని చూస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా రిలీజ్ డేట్ ని ఒక కొత్త పోస్టర్ తో ప్రకటించారు.

తాజాగా కంగువ టీమ్ నుంచి ఒక కొత్త పోస్టర్ వచ్చింది. ఈ పోస్టర్ లో స్పెషల్ ఏంటి అంటే.. సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో సూర్య ఒక డిఫరెంట్ రోల్ చేయబోతున్నాడు. చరిత్రలో ఒక యోధుడిగా.. అలాగే ప్రెజెంట్ లో ఒక ఫైటర్ గా చేయబోతున్నాడు. అదే విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా కూడా రివీల్ చేశారు. అప్పటి నుంచే ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. పైగా.. డైరెక్టర్ శివ కావడంతో అవి ఆకాశాన్ని తాకాయి.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్స్, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచుతూనే వచ్చాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా చాలా కొత్తగా ఉంది. ఒక పెద్ద శవాల గుట్ట మీద సూర్య తన కత్తిని గాల్లోకి లేపి నిల్చుని ఉన్నాడు. ఇంకా ఈ సినిమాలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ కూడా ఉంది. దిశా పటాని, నటరాజన్ సుబ్రమణియం, జగపతి బాబు, యోగిబాబు, రెడిన్ కింగ్స్ లే, కోవై సరళ, ఆనంద రాజ్, మరిముత్తు ఇలా ఎంతో మంది కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. మరి.. అక్టోబర్ 10న కంగువ విడుదుల కానుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom