iDreamPost
android-app
ios-app

Rohit-Virat: రోహిత్, కోహ్లీ కాదు.. భారత్ పగ తీర్చడం అతనొక్కడి వల్లే అవుతుంది!

  • Published Jun 27, 2024 | 9:08 PM Updated Updated Jun 27, 2024 | 9:08 PM

టీమిండియా పగ తీర్చడం అతనొక్కడి వల్లే అవుతుందని మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్నాడు. రోహిత్, కోహ్లీ కాదు.. రివేంజ్ తీర్చడం అతడికే సాధ్యం అవుతుందని చెప్పాడు.

టీమిండియా పగ తీర్చడం అతనొక్కడి వల్లే అవుతుందని మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్నాడు. రోహిత్, కోహ్లీ కాదు.. రివేంజ్ తీర్చడం అతడికే సాధ్యం అవుతుందని చెప్పాడు.

  • Published Jun 27, 2024 | 9:08 PMUpdated Jun 27, 2024 | 9:08 PM
Rohit-Virat: రోహిత్, కోహ్లీ కాదు.. భారత్ పగ తీర్చడం అతనొక్కడి వల్లే అవుతుంది!

టీ20 వరల్డ్ కప్​లో అసలైన పోరుకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని నిమిషాల్లో రెండో సెమీఫైనల్ జరగనుంది. ఫైనల్ బెర్త్ కోసం భారత్-ఇంగ్లండ్ మధ్య భీకర యుద్ధం జరగనుంది. బట్లర్ సేనకు ఇది మరో సెమీస్ మాత్రమే. కానీ టీమిండియాకు అలా కాదు. అరంగేట్ర టీ20 ప్రపంచ కప్ తర్వాత మళ్లీ పొట్టి ఫార్మాట్​లో మెన్ ఇన్ బ్లూ విజేతగా నిలవలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా సెమీస్ లేదా ఫైనల్స్ వరకు వచ్చి ఆగిపోయింది. 2022 సెమీస్​లోనూ ఇదే జరిగింది. అయితే ఆ ఏడాది నాకౌట్ ఫైట్​లో ఇంగ్లండ్ చేతుల్లో ఓటమిపాలైంది భారత్. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తయింది. ఆ ఓటమి బాధ నుంచి బయటకు రావడానికి క్రికెటర్లకు చాలా సమయం పట్టింది. అయితే ఆ అవమానానికి బదులు తీర్చుకోవడానికి ఇప్పుడు టైమ్ వచ్చింది.

అదే ఇంగ్లండ్ టీమ్​తో మళ్లీ వరల్డ్ కప్ సెమీస్​లో తలపడుతోంది టీమిండియా. కాబట్టి ఆ జట్టుపై రివేంజ్ తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి తరుణం ఉండదు. అన్ని అస్త్రాలను బయటకు తీసి బట్లర్ సేనను చిత్తు చేయాలి. అప్పుడు ఫైనల్ బెర్త్ దక్కడంతో పాటు పగ కూడా చల్లారుతుంది. భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్​ను ఓడించి తీరాలని అన్నాడు. అయితే ఆ జట్టుపై రివేంజ్ తీరాలంటే అది విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ వల్ల కాదన్నాడు. అందుకు కరెక్ట్ ప్లేయర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్-2022 సెమీఫైనల్​లో ఇంగ్లండ్ చేతుల్లో భారత్ ఓడిందని.. అయితే ఆ మ్యాచ్​లో కుల్దీప్ ఆడలేదన్నాడు చావ్లా.

టీ20 వరల్డ్ కప్-2022 సెమీస్​లో కుల్దీప్ లేకపోవడం భారత్​ను తీవ్రంగా దెబ్బతీసిందన్నాడు చావ్లా. అతడు ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదన్నాడు. రివేంజ్ తీర్చుకోవడానికి టీమిండియాకు ఇదే సరైన సమయమని చెప్పాడు. ఇప్పుడు కుల్దీప్ భీకర ఫామ్​లో ఉన్నాడని.. ఇంగ్లీష్ టీమ్​తో నాకౌట్ ఫైట్​లో అతడు చాలా కీలకమని పేర్కొన్నాడు చావ్లా. ‘ఇంజ్యురీ తర్వాత కుల్దీప్ యాదవ్ కమ్​బ్యాక్ ఇచ్చిన తీరు అద్భుతం. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అతడికి ఎదురేలేదు. 2022 ప్రపంచ కప్ సెమీస్​లో అతడు జట్టులో లేకపోవడం టీమిండియాకు బిగ్ మైనస్​గా మారింది. కానీ ఈసారి కుల్దీప్ టీమ్​లో ఉన్నాడు. సెమీస్​లో తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని చావ్లా వ్యాఖ్యానించాడు. నాకౌట్ ఫైట్​లో కుల్దీప్ చాలా ఎఫెక్టివ్​గా మారతాడని.. అతడు ఎలా బౌలింగ్ చేస్తాడనేది భారత జట్టు విజయావకాశాలను ప్రభావితం చేస్తుందన్నాడు. మరి.. టీమిండియా పగ తీర్చేది కుల్దీపే అంటూ చావ్లా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.