iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్‌కి ప్రభాస్ చేసిన రెండు వాగ్దానాలు! మొదటిది నెరవేరింది.. ఇక రెండోదే!

  • Published Jun 27, 2024 | 10:10 PM Updated Updated Jun 27, 2024 | 10:10 PM

Prabhas 2 Promises: మాట నిలబెట్టుకోవడంలో ప్రభాస్ కి ప్రభాసే సాటి. సరిగ్గా ఏడాది క్రితం అభిమానులకు రెండు వాగ్దానాలు చేశారు. అందులో మొదటి వాగ్దానం పూర్తయిపోయింది. ఇక రెండోదే మిగిలి ఉంది. ఇంతకీ ప్రభాస్ చేసిన ఆ వాగ్దానాలు ఏంటి? నిలబెట్టుకున్న మొదటి వాగ్దానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Prabhas 2 Promises: మాట నిలబెట్టుకోవడంలో ప్రభాస్ కి ప్రభాసే సాటి. సరిగ్గా ఏడాది క్రితం అభిమానులకు రెండు వాగ్దానాలు చేశారు. అందులో మొదటి వాగ్దానం పూర్తయిపోయింది. ఇక రెండోదే మిగిలి ఉంది. ఇంతకీ ప్రభాస్ చేసిన ఆ వాగ్దానాలు ఏంటి? నిలబెట్టుకున్న మొదటి వాగ్దానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • Published Jun 27, 2024 | 10:10 PMUpdated Jun 27, 2024 | 10:10 PM
ఫ్యాన్స్‌కి ప్రభాస్ చేసిన రెండు వాగ్దానాలు! మొదటిది నెరవేరింది.. ఇక రెండోదే!

ప్రభాస్ నటించిన కల్కి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. నాగ్ అశ్విన్ టేకింగ్ కి ఆడియన్స్ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. సలార్ తో బాక్సాఫీస్ ని ఊచకోత కోసిన ప్రభాస్.. కల్కితో మరోసారి ఉచకోత కోస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ మాట మీద నిలబడ్డారు. ఆదిపురుష్ సమయంలో ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట మీద నిలబడి చూపించారు. ఆ మాట ఏంటంటే? ఏడాదికి రెండు సినిమాలైనా చేస్తా అని.. కుదిరితే మూడు సినిమాలు అయినా నా నుంచి వచ్చేలా చూస్తా అని గత ఏడాది జూన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కి మాట ఇచ్చారు. ఆది పురుష్ సినిమా విడుదల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. చెప్పినట్లుగానే ఆరోజు నుంచి ఏడాది కాలంలో మూడు సినిమాలతో అలరించారు డార్లింగ్ ప్రభాస్.

గత ఏడాది చివరిలో సలార్ సీజ్ ఫైర్ తో వచ్చిన ప్రభాస్.. ఆరు నెలల గ్యాప్ తో కల్కి 2898 ఏడీ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట ప్రకారం.. ఏడాది కాలంలో రెండు సినిమాలతో మీ ముందుకు వస్తా అన్నారు.. వచ్చి చూపించారు. కుదిరితే మూడు సినిమాలు చేస్తా అన్నారు. అది కూడా చేసి చూపించేలా ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ నుంచి రానున్న ఆ మూడవ సినిమా ఏంటి అనేది చూసుకుంటే అది మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీనే. ఎందుకంటే సలార్ శౌర్యాంగ పర్వం మూవీ షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది. సలార్ సీజ్ ఫైర్ భారీ విజయాన్ని అందుకోవడంతో సలార్ 2 పై భారీ హైప్ ఏర్పడింది. దీంతో ప్రశాంత్ నీల్.. ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ తో స్ట్రాంగ్ డ్రామాని కథలో చొప్పిస్తున్నారు.

ఖాన్సారా ప్రపంచాన్ని మరింత డెప్త్ గా చూపించనున్నారు. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతుంది. ఇక ప్రభాస్ చేస్తున్న మరో మూవీ స్పిరిట్. ఇది సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందుతుంది. ఇది ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే స్క్రిప్ట్ లాక్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి కొన్ని నెలలు పడుతుంది. ఈ ఏడాది చివరి నాటికి మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రభాస్ నుంచి వచ్చే సినిమా ‘ది రాజా సాబ్’ అని స్పష్టమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ కీలక షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్ కోసం ప్రభాస్ కొంచెం కష్టపడి ఏదోలా సమయం కేటాయిస్తే సినిమా ఈ ఏడాదిలోనే పూర్తైపోతుంది. అదే జరిగితే కనుక ఏడాది వ్యవధిలో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇచ్చిన మూడు సినిమాల కమిట్మెంట్ ని ఫుల్ ఫుల్ చేసినట్లు అవుతుంది.

అయితే ఇవే కాకుండా కల్కి రెండో భాగం షూటింగ్ మొదలవ్వనుంది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు డార్లింగ్. దీంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. మొత్తంగా ప్రభాస్ చేతిలో ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడితో ఒక సినిమా మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయి. ఇవి చాలవన్నట్టు ఫ్యాన్స్ కి బోనస్ గా కన్నప్ప మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఎలా చూసినా గానీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట కోసం బాగా కష్టపడుతున్నారు. కష్టాన్ని అయినా ఇష్టంగా మలచుకుని ఫ్యాన్స్ ని సంతోషపెట్టడం కోసం మూడు సినిమాలు ఖచ్చితంగా ఇవ్వాలన్న నియమాన్ని పెట్టుకున్నారు. ఇందుకే కదా ప్రభాస్ ని మహారాజు అనేది. 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş