iDreamPost
android-app
ios-app

ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అలా చేస్తే ప్రతి నెలా 3 వేలు నష్టపోతారు!

  • Published Jun 27, 2024 | 8:42 PM Updated Updated Jun 27, 2024 | 8:42 PM

3K Charges For These Credit Cards: ఈరోజుల్లో చాలా మంది దగ్గర క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. కరెంట్ బిల్లులు, నెట్ బిల్లులు, రీఛార్జ్ లు, షాపింగ్ లకి ఇలా చాలా రకాల ట్రాన్సక్షన్స్ కి క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. అయితే ఇక నుంచి మీరు మీ క్రెడిట్ కార్డుతో ఇలా చేస్తే కనుక ప్రతి నెలా మీరు 3 వేల రూపాయలు నష్టపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే?

3K Charges For These Credit Cards: ఈరోజుల్లో చాలా మంది దగ్గర క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. కరెంట్ బిల్లులు, నెట్ బిల్లులు, రీఛార్జ్ లు, షాపింగ్ లకి ఇలా చాలా రకాల ట్రాన్సక్షన్స్ కి క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. అయితే ఇక నుంచి మీరు మీ క్రెడిట్ కార్డుతో ఇలా చేస్తే కనుక ప్రతి నెలా మీరు 3 వేల రూపాయలు నష్టపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే?

ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అలా చేస్తే ప్రతి నెలా 3 వేలు నష్టపోతారు!

క్రెడిట్ కార్డులు వాడేవారు ఎక్కువైపోయారు. ఎప్పుడూ క్రెడిట్ కార్డుల జోలికి పోని వాళ్ళు కూడా క్రెడిట్ కార్డులు వాడే పరిస్థితికి వచ్చేసారు. అయితే ఈ క్రెడిట్ కార్డులు వాడడం వల్ల క్యాష్ బ్యాక్ లు, రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. కాబట్టి క్రెడిట్ కార్డు యూజర్లు కాస్త హ్యాపీగా ఫీలవుతారు. అయితే చాలా వరకూ అన్ని లావాదేవీల మీద రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ అనేవి వస్తున్నాయి. చాలా బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులపై ఈ ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు మాత్రం ఈ విషయంలో ఇటీవల కొన్ని మార్పులు తీసుకొచ్చాయి. తాజాగా మరో ప్రైవేటు బ్యాంకు కూడా తమ క్రెడిట్ కార్డులపై కీలక మార్పులు తీసుకొచ్చింది. ఆ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఆ లావాదేవీలు జరిపితే అదనంగా 3 వేల వరకూ ఛార్జీ విధిస్తామని బ్యాంకు తెలిపింది.

బ్యాంకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. మీరు ప్రతి నెలా ఇలా చేస్తే నెలకు 3 వేల వరకూ నష్టపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడుతున్నట్లైతే ఈ కొత్త నిబంధన గురించి తెలుసుకోండి. క్రెడిట్ కార్డు ద్వారా బిల్స్ పే చేస్తే రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ లు సహా పలు ప్రయోజనాలు వంటివి వస్తుంటాయి. అయితే ఇటీవల చాలా బ్యాంకులు రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ ల విషయంలో కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలోకి దేశీయ దిగ్గజ ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ చేరిపోయింది. ఇక నుంచి క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపులు చేస్తే అదనపు ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపింది.

బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా క్రెడ్, చెక్, మొబిక్విక్, పేటీఎం, ఫ్రీఛార్జి సహా ఇతర ప్లాట్ ఫామ్ ల ద్వారా రెంట్ పే చేసే వారి నుంచి ఇకపై 1 శాతం ఫీజు వసూలు చేయాలని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయించింది. గరిష్టంగా 3 వేల వరకూ రుసుము ఉంటుందని బ్యాంక్ పేర్కొంది. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఈ నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. మీరు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు వాడుతున్నట్లైతే కనుక అద్దె చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పొరపాటున క్రెడ్, పేటీఎం వంటి ప్లాట్ ఫామ్ ల ద్వారా చెల్లిస్తే 1 శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అద్దెను బట్టి 3 వేల వరకూ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్.. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు మినహా మిగతా అన్ని క్రెడిట్ కార్డుల మీద అద్దె చెల్లింపులు, ఈ-వాలెట్ లోడింగ్ ట్రాన్సక్షన్స్ పై రివార్డు పాయింట్లను తొలగించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచే ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఎస్బీఐ బ్యాంక్ కూడా పలు కార్డులపై అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను ఆపివేసింది. ఆరమ్, ఎస్బీఐ కార్డు ఎలైట్, సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డుల ద్వారా రెంట్ పేమెంట్స్ చేస్తే రివార్డ్ పాయింట్స్ రావని స్పష్టం చేసింది. మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా త్వరలో టాటా న్యూ ఇన్ఫినిటీ, టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డుల్లో కీలక మార్పులు తీసుకురానుంది. యూపీఐ లావాదేవీలపై న్యూ కాయిన్స్ ని అందించనుంది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త మార్పులు అమలులోకి రానున్నాయి.