iDreamPost
android-app
ios-app

ఆరేళ్లు అవుతున్నా డెలివరీ కాని ప్రాడెక్ట్! అంతగా ఏం ఆర్డర్ పెట్టావ్ గురూ!

  • Published Jun 27, 2024 | 5:38 PM Updated Updated Jun 27, 2024 | 5:38 PM

Since 6 Years Item Not Delivered: మామూలుగా ఆన్ లైన్ లో ఏవైనా వస్తువులు ఆర్డర్ పెడితే 2, 3 రోజుల్లో వస్తాయి కదా. మహా అయితే ఒక వారం, పది రోజులు పడుతుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి విషయంలో మాత్రం ఆర్డర్ చేసిన ఆరేళ్ళకి కూడా ఇంకా ప్రాడెక్ట్ డెలివర్ కాలేదు. ‘ఇవాళ వస్తుంది’ అని రోజూ ఆర్డర్ స్టేటస్ లో చూపిస్తుంది. దీంతో విసిగిపోయిన ఆ యువకుడు…

Since 6 Years Item Not Delivered: మామూలుగా ఆన్ లైన్ లో ఏవైనా వస్తువులు ఆర్డర్ పెడితే 2, 3 రోజుల్లో వస్తాయి కదా. మహా అయితే ఒక వారం, పది రోజులు పడుతుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి విషయంలో మాత్రం ఆర్డర్ చేసిన ఆరేళ్ళకి కూడా ఇంకా ప్రాడెక్ట్ డెలివర్ కాలేదు. ‘ఇవాళ వస్తుంది’ అని రోజూ ఆర్డర్ స్టేటస్ లో చూపిస్తుంది. దీంతో విసిగిపోయిన ఆ యువకుడు…

ఆరేళ్లు అవుతున్నా డెలివరీ కాని ప్రాడెక్ట్! అంతగా ఏం ఆర్డర్ పెట్టావ్ గురూ!

ఒకప్పుడు షాపింగ్ అంటే ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. కానీ టెక్నాలజీ వినియోగం పెరిగాక చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చాకా షాపింగ్ కూడా ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లో ఉండే కావాల్సిన వస్తువులన్నీ ఆర్డర్ చేసుకునేంతగా డెవలప్ అయ్యింది. కార్లు, బైకులు కూడా ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. టెస్ట్ రైడ్ కావాలంటే ఇంటి దగ్గరే ఏర్పాటు చేస్తున్నారు కూడా. ఇంత వేగంగా అభివృద్ధి చెందిన ఈ కామర్స్ సంస్థలు.. డెలివరీ అంటే కూడా అంతే వేగంగా చేస్తాయి కదా. ఏ వస్తువునైనా ఆర్డర్ చేస్తే ఒకటి, రెండు రోజుల్లోనే డెలివరీ చేస్తున్నాయి కొన్ని దూరం నుంచి వచ్చేవి ఉంటే కనుక మహా అయితే నాలుగైదు రోజులు పడుతుంది. పీక్ స్టేజ్ లో వారం నుంచి పది రోజులు పడుతుంది. మహా పీక్ స్టేజ్ లో అయితే నెల రోజులు పడుతుంది. అంతకు మించి ల్యాగ్ అనేది ఉండదు. కానీ ఒక వ్యక్తి ఫ్లిప్ కార్ట్ లో 2018లో ఆర్డర్ చేస్తే ఆరేళ్ళు అవుతున్నా ఇంకా ఆ ప్రాడెక్ట్ ‘అవుట్ ఫర్ డెలివరీ’ అనే చూపిస్తుంది. అంతలా ఆరేళ్ళు పట్టడానికి ఆ యువకుడు ఏం ఆర్డర్ చేశాడంటే?

ఆరేళ్ళు పట్టడానికి అతనేమీ ఎక్కడో వేరే గ్రహంలో ఉన్న వస్తువుని ఆర్డర్ చేయలేదు. ఒకవేళ అంత సమయం పట్టేట్టు ఉంటే ఫ్లిప్ కార్ట్ కూడా ఆ వస్తువుని వెబ్ సైట్ లో పెట్టదు. ఇంతకీ ఆ వ్యక్తి ఆర్డర్ చేసింది ఏంటో తెలుసా? ఒక జత చెప్పులు. అవును స్పార్క్స్ స్పాయిలర్స్ అనే చెప్పులను ఆరేళ్ళ క్రితం అనగా 2018 మే 16న ఆర్డర్ చేశాడు. ఆ మరుసటి రోజు మే 19న షిప్పింగ్ కూడా అయ్యింది. అవుట్ ఫర్ డెలివరీ కూడా చూపించింది. 2018 మే 20న డెలివరీ అవుతుంది అని ఫ్లిప్ కార్ట్ యాప్ లో కూడా చూపించింది. అయితే ఆరేళ్ళు గడిచినా ఆ మెసేజ్ అలానే కనబడేసరికి యువకుడికి మైండ్ బ్లాక్ అయిపోయింది.

ముంబైకి చెందిన అహ్సన్ ఖర్ బాయ్ అనే వ్యక్తి 2018 మే 16న ఫ్లిప్ కార్ట్ లో 485 రూపాయల విలువ చేసే చెప్పులను ఆర్డర్ చేశాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ ఆ ఆర్డర్ డెలివరీ కాలేదు. ప్రతిరోజూ ఆర్డర్ స్టేటస్ లో ఇవాళ వస్తుంది అనే చూపిస్తుంది. ఆరేళ్ళు గడిచినా ఇంకా అలానే చూపిస్తుండడంతో ఆ ఆర్డర్ ని క్లోజ్ చేయాలని అనుకున్నాడు.క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ని ఎంచుకున్నాడు కాబట్టి ఆర్డర్ ఆలస్యం అవుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. కస్టమర్ సర్వీస్ కి కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే ఆర్డర్ ని క్యాన్సిల్ చేసే ఆప్షన్ లేకపోవడంతో క్లోజ్ చేసేందుకు ఫ్లిప్ కార్ట్ కస్టమర్ సర్వీస్ కి కాల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత రోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఆ యువకుడికి కాల్ వచ్చింది. ఆర్డర్ తో వచ్చిన సమస్య ఏంటి అని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధులు అడిగారని ఆ యువకుడు వెల్లడించాడు. అయితే జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు కూడా చెప్పిందని పేర్కొన్నాడు. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఎక్స్ ఖాతాలో వెల్లడించాడు. ప్రస్తుతం పోస్ట్ వైరల్ అవుతోంది.