iDreamPost

దారుణం: టీ పెట్టలేదని కోడల్ని ఉరేసి చంపిన అత్త!

అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదాలు, గొడవలు అనేవి సహజం. కొందరు ప్రతి చిన్న విషయానికి పంతాలకు పోయి..పోట్లాడుకుంటారు. తాజాగా టీ విషయంలో ఓ అత్త..కోడాలిపై దారుణానికి పాల్పడింది.

అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదాలు, గొడవలు అనేవి సహజం. కొందరు ప్రతి చిన్న విషయానికి పంతాలకు పోయి..పోట్లాడుకుంటారు. తాజాగా టీ విషయంలో ఓ అత్త..కోడాలిపై దారుణానికి పాల్పడింది.

దారుణం: టీ పెట్టలేదని కోడల్ని ఉరేసి చంపిన అత్త!

నేటి సమాజంలో మనుషుల్లో సహనం అనేది కొరవడింది. ఇదే సమయంలో రోజు రోజుకీ మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం, దాడుల చేసుకోవడం చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. కొన్ని సంఘటనలో చిన్న వివాదలకే ప్రాణాలు తీస్తున్నారు. నేటి కాలంలో ఎక్కడ చూసిన ఇలాంటి నేరాలు ఘోరాలేకనిపిస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన, ఆందోళన కరమైన విషయం ఏమింటే.. కుటుంబ సభ్యుల మధ్య కూడా జరిగే వివాదలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా టీ విషయంలో ఓ అత్త ఏకంగా తన కోడలినే హత్య చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకుంది. స్థానికు తెలిపిన వివరాల ప్రకారం….

అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదాలు, గొడవలు అనేవి సహజం. ఎక్కువ కుటుంబాల్లో ఇదే కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయానికి అత్తాకోడళ్లు పంతాలకు పోయి..పోట్లాడుకుంటారు. కొన్ని సందర్భాల్లో పరస్పరం దాడులు చేసుకుంటారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడమే కాకుండా ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. చిన్న గుండు పిన్ను దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు ప్రతి విషయంలోనూ చాలా మంది అత్తాకోడళ్లు  గొడవలు పడుతుంటారు.

చాలా తక్కువ మంది  మాత్రం సొంత తల్లీకూతుళ్ల మాదిరిగా కలిసి ఉంటారు. కొన్ని సందర్భాల్లో అత్తను కోడలు చంపిగా, మరికొన్ని ఘటనల్లో అత్తే కోడల్ని చంపేస్తుంది. అయితే వాళ్లు ఇలా హత్యలు చేయడానికి గల కారణాలు తెలుసుకుంటే..కొన్ని చాలా సిల్లీగా ఉంటాయి. తాజాగా అత్తా కోడళ్ళ మధ్య టీ కోసం చిన్న విషయంలో చోటు చేసుకున్న ఘర్షణ అత్త..కోడలి  ప్రాణం తీసేదాకా వెళ్ళింది. హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ డివిజన్ పరిధిలోని హసన్ నగర్ ప్రాంతంలో ఫర్జాన అనే మహిళ తన కొడుకు కోడలితో కలిసి నివాసం ఉంటుంది. ఆమె కోడలు అజ్మీర్ బేగం(28)తో తరచు చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు.

గురువారం ఉదయం ఫర్జాన తన కోడల్ని ఛాయ్ పెట్టి ఇవ్వమని చెప్పింది. అయితే టీ పెట్టేందుకు అజ్మీర్ బేగం నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అత్త చున్నీతో కోడలు మెడకు బిగించి ఉరివేసి హత్య చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. మనుషుల్లో సహనం, సర్ధుకుపోయే గుణం లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి