iDreamPost
android-app
ios-app

సన్నీ లియోన్- ప్రియమణి నట విశ్వరూపం.. చెమటలు పట్టిస్తున్న కొత్త ట్రైలర్!

  • Published Jun 27, 2024 | 9:41 PM Updated Updated Jun 27, 2024 | 9:41 PM

Quotation Gang Movie Trailer: సన్నీ లియోన్- ప్రియమణి- జాకీ షార్ఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ఈ మూవీలో తమ నటనతో వీళ్లు ఆడియన్స్ కి చెమటలు పట్టించేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Quotation Gang Movie Trailer: సన్నీ లియోన్- ప్రియమణి- జాకీ షార్ఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ఈ మూవీలో తమ నటనతో వీళ్లు ఆడియన్స్ కి చెమటలు పట్టించేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

  • Published Jun 27, 2024 | 9:41 PMUpdated Jun 27, 2024 | 9:41 PM
సన్నీ లియోన్- ప్రియమణి నట విశ్వరూపం.. చెమటలు పట్టిస్తున్న కొత్త ట్రైలర్!

పాన్ ఇండియా లెవల్లో విలక్షణ నటనతో ఆకట్టుకునే స్టార్ హీరోయిన్స్ చాలా అరుదుగా ఉన్నారు. ఆ లిస్ట్ లోకి కచ్చితంగా ప్రియమణి వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్లు చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. పైగా తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రియమణి సుపరిచితురాలే. ఇంక మరోపక్క సన్నీ లియోన్ ఉంది. ఆమె డ్యాన్సర్ గా తన కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్, క్యారెక్టర్ ఆరిస్టుగా ఎదుగుతూ వచ్చింది. ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పుడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ కి చెమటలు పట్టిచేందుకు సిద్ధమైపోయింది. ఈ మూవీపై ఎప్పటి నుంచో మంచి బజ్ ఉంది. ఇప్పుడు సడెన్ గా ట్రైలర్ రిలీజ్ చేసి షాకిచ్చారు.

తమిళ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న ఒక సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ, ఆ తర్వాత మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. మొదట ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ ని రివీల్ చేశారు. వాళ్లెవరంటే జాకీ షార్ఫ్, ప్రియమణి, సన్నీ లియోన్, సారా అర్జున్ వంటి స్టార్స్ ఉన్నారు అనగానే అంతా వెయిట్ చేశారు. పైగా వారి ఫస్ట్ లుక్స్ చూశాక సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా సన్నీ లియోన్ రా అండ్ రస్టిక్ లుక్స్ లో కనిపించింది. ఆ తర్వాత ప్రియమణి కూడా అదే తరహాలో కనిపించింది. మీకు ఈ సినిమా గురించి అర్థం కావాలి అంటే సింపుల్ గా దండుపాళ్యం సినిమా కథ అని చెప్పచ్చు. కాకపోతే ఈ మూవీని గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో చూపించారు.

ఈ సినిమా పేరు కొటేషన్ గ్యాంగ్. అంటే సుపారీకి హత్యలు చేసే వాళ్లు. ఈ గ్యాంగ్ లోకి ప్రియమణిలాంటి లేడీస్ కూడా వచ్చి దందాని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్లకి చంపడం అంటే ఇష్టమేమీ కాదు. కాకపోతే డబ్బుకోసం చంపేస్తుంటారు. వీళ్ల దందా ఎంత వరకు వెళ్లిద్దంటే.. ఒక బడా గ్యాంగ్ స్టర్ ని కూడా చంపేస్తారు. ఈ సినిమా కథ మొత్తం దాదాపుగా గ్యాంగ్ వార్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రియమణి, సన్నీ లియోన్ ఇద్దరూ యాక్టింగ్ ఇరగదీశారు అని అర్థమైపోతోంది.

పైగా ఒక గ్యాంగ్ స్టర్ గా జాకీ షార్ఫ్ ఉన్నాడు. ఈ ట్రైలర్ లో ప్రియమణి యాక్టింగ్, లుక్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా టాప్ నాచ్ అనే చెప్పాలి. ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం రివీల్ చేయలేదు. మరికొన్ని రోజుల్లోనే రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరి.. ఈ కొటేషన్ గ్యాంగ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet