iDreamPost
android-app
ios-app

OTTలోనే బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ కి పిచ్చెక్కిపోతారు!

  • Published Jun 27, 2024 | 8:51 PM Updated Updated Jul 08, 2024 | 4:48 PM

OTT Best Sci-Fi Series : వెబ్ సిరీస్ లను చూడడానికి ప్రేక్షకులు ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ చుపిస్తున్నారన్న సంగతి తెలిసిందే. మరి ఓ మంచి సైన్స్ ఫిక్షన్ సిరీస్ ను చూడాలనుకునే వారికీ మాత్రం ఈ సిరీస్ బెస్ట్ సజ్జెషన్.

OTT Best Sci-Fi Series : వెబ్ సిరీస్ లను చూడడానికి ప్రేక్షకులు ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ చుపిస్తున్నారన్న సంగతి తెలిసిందే. మరి ఓ మంచి సైన్స్ ఫిక్షన్ సిరీస్ ను చూడాలనుకునే వారికీ మాత్రం ఈ సిరీస్ బెస్ట్ సజ్జెషన్.

  • Published Jun 27, 2024 | 8:51 PMUpdated Jul 08, 2024 | 4:48 PM
OTTలోనే బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ కి పిచ్చెక్కిపోతారు!

హర్రర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ సినిమాలనే కాకుండా.. సైన్స్ ఫిక్షన్ సినిమాలను కూడా ఈ మధ్య ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. పాస్ట్ లో ఏం జరిగింది అనే క్యూరియాసిటీ అందరికి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ ను మేకర్స్ కూడా చాలా కొత్తగా చూపించడంతో.. ఈ జోనర్ లో వచ్చే సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటిది సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ లో వెబ్ సిరీస్ లుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ చూస్తూ ఉంటారు. అసలు ఇప్పుడు వెబ్ సిరీస్ ల మీద ప్రేక్షకులకు బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. కాబట్టి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ల కోసం సెర్చ్ చేసే వారికి.. ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఈ వెబ్ సిరీస్ ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ వెబ్ సిరీస్ ను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి.

వెబ్ సిరీస్ లలో ఎప్పటికి అందరికి గుర్తుండిపోయే వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ మేకర్స్ నుంచి వచ్చిందే. ఈ వెబ్ సిరీస్ పేరు “త్రి బాడీ ప్రాబ్లమ్స్” . ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్. ఈ సిరీస్ మొత్తం కూడా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ గంట సమయం పాటు ఉంటుంది. ఇక ఈ సిరీస్ స్టోరీ లైన్ ఏంటంటే.. హ్యుమానిటీ కి ఓ డేంజరస్ సిట్యుయేషన్ అనేది వస్తుంది. ఇలాంటి డేంజరస్ సిట్యుయేషన్స్ నుంచి ప్రజలందరినీ కాపాడడానికి ఓ సైంటిస్ట్ బృదం ఏం చేశారు అనేదే ఈ మూవీ స్టోరీ. మొదటి ఎపిసోడ్ నుంచి ఐదవ ఎపిసోడ్ వరకు కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా.. కొత్తగా ఉంటూ ఉంటుంది. కొంచెం కంఫ్యూజింగ్ ఏంటంటే.. కథలో పాస్ట్ ను ప్రెసెంట్ ను ఒకేసారి చూపిస్తారు. ఇక అసలు త్రి బాడీ ప్రాబ్లమ్స్ కి మీనింగ్ ఏంటి అనేది ఐదవ ఎపిసోడ్ లో దాదాపు అర్థమైపోతుంది.

కాకపోతే ఆరవ ఎపిసోడ్ నుంచి ఎనిమిదవ ఎపిసోడ్ వరకు అసలు సైంటిస్ట్ లు అంతా కలిసి.. ఫ్యూచర్ లో వచ్చే ఆపదలను ఎలా అడ్డుకుంటారనేది చూపిస్తారు. రాకెట్ సైన్స్ , స్పేస్ గురించి బాగా అవగాహనా ఉన్న వారికి లాస్ట్ త్రి ఎపిసోడ్స్ బాగా అర్ధమౌతాయి. ఓ మంచి సైంటిఫిక్ సిరీస్ చూడాలంటే మాత్రం.. ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.